Telangana: పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై భక్తులో ఆందోళన!

Updated on: Mar 25, 2026 | 3:42 PM

గోదావరిలో, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం పర్ణశాల వద్ద పడవ నిర్వాహకుల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికుల తీసుకెళ్లే పడవల్లో కనీస సేఫ్టీ కిట్స్ లేకపోవడంలో ప్రయాణికులు భద్రతపై ఆందోళన తలెత్తుతోంది. ఇక ఈ నెల 27న భద్రాద్రిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి భద్రతా నిబంధనలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

1 / 5
గోదావరిలో విహారయాత్ర అంటే అందరికీ గుర్తొచ్చ ఎత్తైన కొండలు, పచ్చిని చెట్ల మధ్య పడవ ప్రయాణం.. అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రకృతి ఎంత అందంగా ఉందనే చూస్తారు కానీ.. ఏదైనా ప్రమాదం జరిగితే తమను రక్షించేందుకు తాము ప్రయాణించే బోల్‌టో సేఫ్టీ ఐటమ్స్ ఉన్నాయా లేవా ఎవరూ చూడరు. ఇదే బోట్‌ నిర్వాహకులు అలుసుగా మారింది. బోల్‌లో ఎలాంటి సేఫ్టీ ఐటమ్స్ ఉంచుకోకుండా నిర్లక్ష్యంగా రోజూ వందల మంది ప్రయాణికులను విహారిని తీసుకెళ్తున్నారు. కొన్ని సార్లు ఈ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం అవుతుంది.

2 / 5
తాజాగా పర్ణశాల బోటింగ్ యాజమాన్యం యాత్రికులు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో బయటపడింది. కనీసం ఆ బోట్లో సేఫ్టీ జాకెట్స్ కూడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా లెక్కకు మించిన ప్రయాణికులతో బోట్‌లను నడుపుతున్నారు. ఇదే విషయం కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా తమను నదిలోకి తీసుకెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు. మార్గ మధ్యలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రయాణికుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు.

3 / 5
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల.. అఖండ భారతదేశంలోనే ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రం. శ్రీరాముడు వనవాసం ఉన్న ప్రాంతం.. రామాయణం చరిత్ర ఘట్టంలోనే ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశం. ఈ పర్ణశాల పుణ్యక్షేత్రంలో నాటి లక్ష్మణ సమేత సీతారాముల తీపి జ్ఞాపకాలు ఇప్పటికీ చెల్లా చెదురు కాకుండా అలాగే ఉన్నాయి. అందుకే ఇక్కడి దృశ్యాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆథ్యాత్మిక దర్శనంతో పాటు పచ్చని ప్రకృతిని తిలకించే అవకాశం కూడా లభిస్తుంది.

4 / 5
అవును ఇక్కడికి వచ్చే పర్యాటకులు గోదావరిలో పడవ ప్రయాణం చేసేందుకు ఎంతగానో ఇష్టపడుతారు.  రాకరాక వచ్చాము అలా గోదావరి అందాలను తిలకిద్దాం అని అనుకుంటారు. కానీ ఆ ఎక్కి బోటులో సేఫ్టీ జోన్స్ ఉన్నాయా లేవా అని ఎవరు అంతగా పట్టించుకోరు. ప్రతి శని ఆదివారాల్లో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి బోటింగ్ లో పాల్గొంటారు. కానీ ఈ బోటింగ్ యాజమాన్యం మాత్రం అధికారులు పెట్టిన రూల్స్‌ను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బోట్‌లను నడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహిరిస్తున్నారు.

5 / 5
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాద్రికి చేరుకుంటున్నారు. 27వ తేదీన జరగబోయే   సీతారామచంద్రస్వామి వారి కల్యాణానికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ఇప్పటికైనా అధికారులు ఈ నిర్లక్ష్యంపై స్పందించి నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేయాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని స్థానికులు కోరతున్నారు.

Follow Us