
నెయ్యి కేవలం రుచికే కాదు, పోషకాల గని. ఇందులో విటమిన్లు A, D, E, K లతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం కడుపు ఉబ్బరం లేదా జీర్ణ రుగ్మతలతో బాధపడేవారికి ఈ పానీయం సరైన పరిష్కారం. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది.

గోరువెచ్చని నీటితో నెయ్యి కలవడం వల్ల పేగులలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. పదేపదే వేధించే అసిడిటీ, మలబద్ధకం సమస్యల నుంచి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వయసు పైబడటం వల్ల లేదా శీతాకాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, జాయింట్ స్టిఫ్ నెస్ ను తగ్గించడంలో నెయ్యి నీరు సహాయపడుతుంది. ఇది కీళ్లను అంతర్గతంగా బలోపేతం చేస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను ఈ పానీయం బయటకు పంపుతుంది. దీనివల్ల ముఖంపై ఉండే మచ్చలు, మరకలు తొలగిపోయి చర్మం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. నెయ్యి తాగి నీరు తాగడం వల్ల కడుపు ఎక్కువ సమయం నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆకలి, అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు.

ఈ పానీయం జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, అసిడిటీ మరియు మలబద్ధకం సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని సెలబ్రిటీ న్యూట్రిషనిస్టులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం ఈ చిన్న అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.