Ghee Benefits: నెయ్యి తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారా.. శరీరానికి నెయ్యి కావాల్సిందే.. కండిషన్స్ అప్లై..

|

Feb 20, 2024 | 8:38 AM

కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఇది తినవద్దు, అది తినవద్దు.. తింటే ఆరోగ్యం పాడైపోతుంది అనే నియమ నిబంధనలు ఉండేవి కావు. నచ్చిన ఆహారాన్ని ఇష్టంగా తినేవారు.. అందుకు తగిన శారీరక శ్రమ పడేవారు. ముఖ్యంగా నూనె, నెయ్యి వినియోగంలో ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు. అయితే నేటి తరం డైట్ అంటూ తినే ఆహారం విషయంలో ఎన్నో ఆంక్షలు పెట్టుకుంటున్నారు. దీంతో నెయ్యి తింటే బరువు పెరుగుతారని.. భావిస్తారు. వాస్తవంగా నెయ్యి తింటే బరువు పెరుగుతారా తెలుసుకుందాం.. 

1 / 10
నెయ్యిలో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ (మంచి కొవ్వులు), CLA , కొవ్వులో కరిగే విటమిన్లు A, E , D ఉంటాయి. ఫలితంగా గుండెకు నెయ్యి ఆరోగ్యవంతమైన ది. అంతేకాదు నెయ్యి క్యాన్సర్‌ను దూరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. గుండె నుంచి రక్త  ప్రసరణ శరీరమంతా స్వేచ్ఛగా జరుగుతుంది. 

2 / 10
నెయ్యితో వేయించిన పరోటా మాత్రమే కాదు, హాల్వా, సేమ్యా ఇలా ఏ ఆహార పదార్ధమైనా సరే రుచికరంగా మారుతుంది. నెయ్యి ఏ ఆహారాన్ని అయినా రుచిగా మారుస్తుంది. అయితే డైట్‌లో ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నెయ్యి తినాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంది.  

3 / 10
నెయ్యి సంతృప్త కొవ్వుగా చెప్పబడుతుంది, ఇది సాధారణంగా చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో  సహాయపడుతుంది. కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సాధారణంగా నెయ్యి తినకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ నెయ్యి లిపోలిటిక్, ఇది రక్తపు లిపిడ్లను పెంచడంలో మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

4 / 10

నెయ్యి మితంగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యిలో కొవ్వు అధికంగా ఉంటుంది. అయినప్పటికి దీనిలో మోనోఅన్‌శాచురేటెడ్ ఒమేగా-3లు అధికంగా ఉంటాయి. ఇవి  ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు. ఇవి గుండె, హృదయనాళ వ్యవస్థకు మేలు చేస్తాయి. నెయ్యి మితంగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

5 / 10
సమతుల్య ఆహారంలో భాగంగా నెయ్యిని ఉపయోగించడం వల్ల అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. నెయ్యిలో ఉండే CLA బరువు తగ్గడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది. నెయ్యిలో కేలరీలు, సంతృప్త కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది గట్ బ్యాక్టీరియాకు మంచిది. ఫలితంగా నెయ్యి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.       

6 / 10
నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఫలితంగా వ్యాధులను నయం చేయడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే నెయ్యి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేయదు. కనుక నెయ్యితో వేయించిన బ్రెడ్ లేదా నెయ్యితో తయారు చేసిన ఏదైనా ఆహారం రోగులకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఖచ్చితంగా డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకు తినండి

7 / 10
ఎముకలు, కీళ్ల నొప్పులకు నెయ్యి ఉపయోగపడుతుంది. నెయ్యి ఎముకల కీళ్లకు లూబ్రికెంట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. వెన్ను నిటారుగా ఉంచడానికి నెయ్యి ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి నెయ్యి తినడం మెదడు పోషణకు మేలు చేస్తుంది

8 / 10
నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రాత్రి మంచి నిద్రకు నెయ్యి కూడా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. మళ్లీ కొద్దిగా మిరియాల పొడిని నెయ్యిలో కలుపుకుంటే దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది

9 / 10
నెయ్యిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అకాల వృద్ధాప్యాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా, దృఢంగా ఉంచడానికి, చర్మం మెరుపును పెంచడానికి నెయ్యిని ఆహారంలో ఉపయోగించండి.  

10 / 10
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 2023 చివరి 'మన్ కీ బాత్' షోలో ప్రధాని నరేంద్ర మోడీతో ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. నెయ్యి తినడం వల్ల శక్తి పెరుగుతుంది. నెయ్యి తింటే బరువు పెరుగుతారు లేదా శరీరంలో కొవ్వు పెరుగుతుందనే ఆలోచన పూర్తిగా తప్పు. ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి తినండి.. అందుకు తగిన శారీరక శ్రమ పదండి అంటున్నాడు అక్షయ్.