
సూర్యోదయానికి ముందే మేల్కొనడం: సూర్యుని తొలి కిరణాలు శరీరాన్ని తాకేలా ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యోదయ సమయంలో మేల్కొనడం వల్ల శరీరం సహజ బాడీ క్లాక్‌తో అనుసంధానమై విటమిన్-డి అందుతుంది. ఇది ఎముకలను దృఢపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నాభిలో నూనె రాయడం: శరీరానికి నాభి ప్రధాన శక్తి కేంద్రం. రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు చుక్కల ఆవనూనె లేదా కొబ్బరి నూనె రాయడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. నాభిలోని 72 వేల నాడుల ద్వారా చర్మానికి తేమ అంది ముఖంపై ముడతలు, పొడిబారడం తగ్గి చర్మం నిగనిగలాడుతుంది.

రాగి పాత్రలోని నీళ్లు: రాత్రంతా రాగి పాత్రలో ఉంచిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఇది శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపి కాలేయం, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

రోజుకు 30 నిమిషాల నడక & యోగా: శరీర కదలికలే దీర్ఘాయుష్షుకు మూలం. రోజూ సూర్య నమస్కారాలు, ప్రాణాయామం లేదా 30 నిమిషాల నడక చేయడం వల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి కండరాలు, కీళ్లు యవ్వనంగా ఉంటాయి.

సరైన ఆహార నియమాలు & ఉపవాసం: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పోషకాలతో నిండుగా, రాత్రి భోజనం తేలికగా ఉండాలి. ప్రతి ముద్దను 32 సార్లు నమిలి తినాలి. వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరంలో 'ఆటోఫేజీ' ప్రక్రియ జరిగి పాత, పాడైపోయిన కణాలు రిపేర్ అవుతాయి.

పాజిటివ్ ఆలోచనలు & ధ్యానం: టెన్షన్ వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి త్వరగా ముడతలు, వృద్ధాప్యం వస్తాయి. రోజూ 15 నిమిషాల ధ్యానం చేయడం వల్ల సెరోటోనిన్, డోపమిన్ వంటి హ్యాపీ హార్మోన్లు పెరిగి మనసు ప్రశాంతమవుతుంది.

రాత్రిపూట గాఢమైన నాణ్యమైన నిద్ర: రాత్రి 10 నుండి ఉదయం 4 గంటల మధ్య శరీరం సహజ రిపేర్ మోడ్‌లో ఉంటుంది. పడుకోవడానికి గంట ముందు మొబైల్ స్క్రీన్లు ఆపేసి, 7-8 గంటలు గాఢంగా నిద్రపోతే మెలటోనిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి కణాలు ఎప్పటికీ యవ్వనంగా ఉంటాయి.