Gas Relief Tips: కడుపులో గ్యాస్‌ సమస్యకు భలే విరుగుడు.. పొద్దున్నే ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం!

Updated on: Feb 23, 2026 | 1:29 PM

ఉదయం వేళల్లో చాలా మందికి గ్యాస్ సమస్య ఉంటుంది. సాధారణం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోరు. కడుపులో గ్యాస్ నిరంతరం భారంగా అనిపించేలా చేస్తుంది. కొందరికి ఈ సమస్య రోజంతా ఉంటుంది. దీంతో ఈ సమస్య నయం చేయడానికి చాలా మంది మందులు తీసుకుంటారు. కానీ కొన్ని ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు..

1 / 5
గోరువెచ్చని నీళ్లు- నిమ్మరసం: ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు 'మేల్కొలుపు' లాంటిది. ఇందులో సగం నిమ్మకాయ పిండి ఈ నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించవచ్చు. ఇది ఆమ్లతను తగ్గిస్తుంది.

2 / 5
అల్లం టీ.. అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమలవచ్చు లేదా నీటిలో మరిగించిన అల్లం టీ తాగవచ్చు. ఇది కడుపు కండరాలను సడలిస్తుంది.

3 / 5
వాము - నల్ల ఉప్పు.. ఇది గ్యాస్ కు అత్యంత పురాతనమైన, అత్యంత ప్రభావవంతమైన నివారణ. వాములో ఉండే 'థైమోల్' జీర్ణ రసాలను సక్రియం చేస్తుంది. ఇందు కోసం అర టీస్పూన్ వాము, చిటికెడు ఉప్పును గోరువెచ్చని నీటితో కలిపి తాగాలి.

4 / 5
జీలకర్ర నీళ్లు.. జీలకర్ర లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందు కోసం ఒక చెంచా జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మరిగించి, వడకట్టి టీ లాగా వేడిగా తాగాలి.

5 / 5
ఇంగువ నీళ్లు.. గ్యాస్ కారణంగా కడుపు నొప్పితో బాధపడుతుంటే ఇలాంటి వారికి ఇంగువ దివ్యౌషధం. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగాలి లేదా ఇంగువ పేస్ట్ లా చేసి నాభి చుట్టూ అప్లై చేయాలి. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

Follow Us