ఫంక్షన్లలో చేసేలా కాలీఫ్లవర్ కర్రీని ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకోవాల్సిందే

Updated on: Sep 14, 2026 | 9:40 PM

శీతాకాలంలో మార్కెట్లలో తాజా కాలీఫ్లవర్ పుష్కలంగా దొరుకుతుంది. అయితే చాలామంది కాలీఫ్లవర్‌తో కేవలం ఆలు-గోబీ ఫ్రై లేదా సాధారణ కుర్మా చేస్తుంటారు. అలా కాకుండా శుభకార్యాలు, ఫంక్షన్లలో వడ్డించేలా తాజా దినుసులతో ప్రత్యేక మసాలా నూరి, పచ్చికొబ్బరి పేస్ట్‌తో చిక్కటి గ్రేవీ పెట్టి వండితే ఆ రుచి రెస్టారెంట్ కూరలను సైతం తలదన్నుతుంది. ముఖ్యంగా కాలీఫ్లవర్‌లో ఉండే సూక్ష్మ క్రిములు పోయేలా ఉప్పు-పసుపు నీళ్లలో బ్లాంచ్ చేసి, పువ్వులు మెత్తబడి విరిగిపోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో ఈ కూరను ఎలా తయారుచేసుకోవాలో స్పైస్ ఫుడ్ కిచెన్ అందించిన విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు: 1 పెద్ద కాలీఫ్లవర్, అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, రుశనగ నూనె, అర స్పూన్ ఆవాలు, రెండు రెమ్మల కరివేపాకు, 3  ఉల్లిపాయలు తరుగు
5 నుండి 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పెద్ద నాటు టమోటాలు, 2 స్పూన్ల కారం పొడి, పచ్చికొబ్బరి ముక్కలు, తాజా కొత్తిమీర తరుగు, 3 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు

కావలసిన పదార్థాలు: 1 పెద్ద కాలీఫ్లవర్, అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, రుశనగ నూనె, అర స్పూన్ ఆవాలు, రెండు రెమ్మల కరివేపాకు, 3  ఉల్లిపాయలు తరుగు 5 నుండి 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పెద్ద నాటు టమోటాలు, 2 స్పూన్ల కారం పొడి, పచ్చికొబ్బరి ముక్కలు, తాజా కొత్తిమీర తరుగు, 3 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు

2 / 5
తయారీ విధానం: గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి మరిగించాలి. నీళ్లు కాగగానే కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌పై సరిగ్గా 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించాలి ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి. అనంతరం నీటిని పూర్తిగా వడకట్టి ముక్కలను పక్కన ఉంచాలి. దీనివల్ల పువ్వులో ఉండే పురుగులు, గుడ్లు పూర్తిగా తొలగిపోతాయి.

3 / 5
పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి చల్లారాక మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పచ్చికొబ్బరి ముక్కలను నీళ్లు కలపకుండా మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి.

4 / 5
బాండీలో వేరుశనగ నూనె వేడిచేసి ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఆపై సన్నగా తరిగిన నాటు టమోటా ముక్కలు వేసి మూతపెట్టి నూనె పైకి తేలేంత వరకు మెత్తగా మగ్గనివ్వాలి.

5 / 5
టమోటాలు మగ్గాక కారం పొడి, కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఆ వెంటనే సిద్ధం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చికొబ్బరి పేస్ట్ మరియు ముప్పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి చిన్న మంటపై 7-8 నిమిషాలు ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న స్పెషల్ మసాలా పొడిని చల్లి, పువ్వులు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపి మరో 2-3 నిమిషాలు చిన్న మంటపై మగ్గనివ్వాలి. కూర చిక్కబడి నూనె పైకి తేలగానే కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అంతే, ఫంక్షన్ల రుచితో ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ మసాలా కర్రీ సిద్ధం! వేడివేడి అన్నం, జొన్న రొట్టెలు, పుల్కా, చపాతీల్లోకి ఇది తిరుగులేని కాంబినేషన్!

Loading...
Unable to load recommendations.
Follow Us