
పచ్చి కొబ్బరి పాయసం ఇలా చేసి తింటే తియ్యగా నోటికి మంచి రుచి ఉంటుంది.ఇంకా ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కూడా. దీనిలో నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా బెల్లం పంచదారతో కలిపి చేస్తారు. ఇది వరకు రోజుల్లో దీనిని బాగా తినేవాళ్లు. అలాగే, పాలతో చేస్తారు కాబట్టి తియ్యగా ఉంటుంది. ఈ పాయసాన్ని ఈజీగా తయారు చేసుకుని మంచిగా తినొచ్చు. ఈ తీపి వంటకాన్ని పండుగల సమయంలో చేసి తింటారు. మరి, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు లేదా పేస్ట్, ఒక కప్పు పాలు, ఒక కప్పు బెల్లం తురుము, ఇంకా కప్పున్నర పంచదార, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 5 జీడిపప్పు, 5 కిస్‌మిస్, రెండు టేబుల్ స్పూన్స్ యాలకుల పొడిని తీసుకోవాలి. వీటిని సరిగ్గా చేస్తే తియ్య తియ్యగా మంచిగా ఉంటుంది.

ముందుగా పచ్చి కొబ్బరిని ప్రిపేర్ చేసుకోవాలి: పచ్చి కొబ్బరి ముక్కలను కడిగి వాటిని మిక్సీలో మెత్తగా తీసుకుని కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత వీటి నుంచి కొబ్బరి పాలను కూడా వేరు చేసి ఒక గ్లాస్ లోకి తీసుకుని వాటిని పక్కన పెట్టుకుని వీటిని వేస్తే రుచి మంచిగా ఉంటుంది.

ఇక ఇప్పుడు బాగా వేయించుకోవాలి : ముందుగా పొయ్యి వెలిగించి ఆ తర్వాత దీనిలో ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జీడిపప్పు,ఆలాగే కిస్‌మిస్ లు కూడా వేసి బాగా వేయించి గిన్నె లేదా ప్లేట్ లో వీటిని పెట్టుకోవాలి. అయితే, జీడిపప్పులు పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని, ఆ తర్వాత వీటిని వేసుకోవడం మంచిది అప్పుడు రోటీకి కూడా మంచిగా ఉంటుంది.

కొబ్బరి పాయసాన్ని బాగా ఉడికించుకోవాలి : ఇంకో పాన్‌లో ఒక కప్పు కొబ్బరి పాలు, ఇంకో కప్పు సాధారణ పాలు తీసుకుని వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత తర్వాత బెల్లం ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా వీటిని కలుపుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే జీడిపప్పు, రెండు స్పూన్స్ యాలకుల పొడి కూడా దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.