
ఈడొచ్చిన వాళ్ళు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి ఉండలు.. ఇలా చేసి తింటే ఒకటితో ఆగరు. తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటాయి. వీటిని చెయ్యడానికి ఎంతో సేపు కూడా పట్టదు కేవలం 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఇక వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

పచ్చి కొబ్బరి ఉండలకు కావలసిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు, ఇంకా మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిను తీసుకోవాలి. రెండు కప్పులు పచ్చి కొబ్బరి పొడి , రెండు కప్పుల బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్లు నూనె , ఒక కప్పున్నర పాలను తీసుకోవాలి. ఇలా చేసి తింటే అస్సలు వదలరు.

ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి : గ్యాస్ పొయ్యి వెలిగించి దానిలో కొద్దిగా నెయ్యి వేసి అది వేడయ్యాక దానిలో జీడిపప్పు, ఇంకా నాలుగు కిస్మిస్ లు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిని కూడా ఇలా వేయించి పెట్టాలి. ఇవి గట్టిగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి, బాగా వేయించి గిన్నె లేదా ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇంకా మళ్ళీ అదే పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి దీనిలో పచ్చి కొబ్బరి పొడి సువాసన వచ్చే వరకు లో ప్లేవర్ మంటపై బాగా వేయించి దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత దీనిని తీసుకుని గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు బెల్లం పాకం మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి దీనిలో కలపాలి.

ఇక చివర్లో ఉండలు చేసుకోవాలి : ఇక ఇప్పుడు చివర్లో కొద్దీ కొద్దిగా పాలను పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడి మీదే ఉన్నప్పుడే దీనిని పక్కన పెట్టి వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కూడావేసి కలపాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని బుడ్డి బుడ్డి లడ్డులుగా చేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి ఉండలు రెడీ.