
ఆడవారికైనా, మగవారికైనా జుట్టు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ లేడీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తే మీ జుట్టులో ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది.

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ముందు స్కాల్ఫ్‌పై కేర్ తీసుకోవాలి. తల మాడుపై రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతూ ఉంటే.. కుదుళ్లు బలంగా, దృఢంగా ఉంటాయి. జుట్టుకు మీరు ఉపయోగించే నూనె గోరువెచ్చగా వేడి చేసి.. తలపై మర్దనా చేయాలి.

మీరు వేసుకునే హెయిర్ స్టైల్స్ కారణంగా కూడా జుట్టు రాలడం జరుగుతుంది. మరీ బిగుతుగా ఉండే జడలు వేసుకోకూడదు. కాస్త లూజుగా ఉండాలి. దీని వల్ల జుట్టు చివర్లు కూడా చిట్లుతుంది. తల స్నానం చేసేటప్పుడు జుట్టుు సరిగా వాష్ చేసుకోవాలి.

అదే విధంగా మీరు నిద్రించే దిండు కవర్స్ కూడా మార్చుతూ ఉండాలి. వీటి వలన కూడా జుట్టుపై ప్రభావం పడుతుంది. మెత్తగా ఉండే దిండు కవర్లు ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

జుట్టు పొడవుగా పెరుగుతుందని చాలా మంచి హెయిర్ కట్ చేయరు. కానీ ప్రతీ నెల లేదా రెండు నెలలకు అయినా ఒక సారి ట్రిమ్ చేయాలి. మీ జుట్టు చివర్లు చిన్నగా కట్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)