ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యం, ఆహారం, చర్మంపై పెద్దగా శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీని వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు చర్మంపై మచ్చలు కూడా ఏర్పడతాయి.మరి ఆ మచ్చలను ఎటువంటి కాస్మటిక్స్ అవసరం లేకుండా సహజంగా తొలగించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి ఆకులు: తులసి ఆకులను మన పురుణాలు, ఆయుర్వేద శాస్త్రాలు దివ్యౌషధంగా పేర్కొన్నాయి. ముఖంపై మచ్చలను తొలగించేందుకు తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖంపై రాసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే ముఖంపై మచ్చలను తొలగించడంలో తులసి సహాయపడుతుంది.
బంగాళదుంప: బంగాళదుంపతో కూడా ముఖంపై మచ్చలను తొలగించుకోవచ్చు. ముందుగా బంగాళాదుంప రసాన్ని తీసి మచ్చల మీద రాయాలి. అది ఆరిపోయే వరకు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేస్తే అనతి కాలంలో మంచి ఫలితాలను పొందవచ్చు.
క్యారెట్: ముఖంపై మచ్చలను తొలగించుకునేందుకు క్యారెట్ తురుముతో కొద్దిగా ముల్తానీ మట్టిని కలపండి. తర్వాత దీనికి అర టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా జోడించండి. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి చర్మంపై రాయండి. అలా 15 నిముషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడగాలి.
వెన్నె: పాలు దాని ఉత్పత్తులు కూడా మన చర్మ సంరక్షణలో ఎంతగానో సహకరిస్తాయి. అందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా వెన్నె తీసుకుని దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ముఖం మీద కాసేపు అలాగే ఉంచి, తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఫలితాలను పొందవచ్చు.