
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ నెలలో మరికొద్ది రోజుల్లో తొలి ఏకాదశి రానుంది. ఆ రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఆ రోజు నుంచే పండుగలు మొదలు కానున్నాయి. తొలి ఏకాదశి ప్రభావం.. కొన్ని రాశుల వారి మీద పడనుంది. వీరికి మొత్తం ప్రతికూలంగా ఉండనుంది. మరి , ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మిథున రాశి: కొత్త మార్పులతో జీవితంలో సతమవుతుంటారు. మిమ్మల్ని మరింత బాధ పెట్టె కొత్త మలుపులు రానున్నాయి. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు. మీరు అడిగినా కూడా లేవని సమాధానం చెబుతారు. కెరీర్ లో కొత్త సమస్యలు వస్తాయి. ఈ సమయం వీరికి అనుకూలంగా అస్సలు ఉండదు. రావాల్సిన ప్రమోషన్ కూడా ఆగిపోతోంది. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఎన్నో ఇబ్బందులు పడతారు. వీరికి అదృష్టం కూడా కలిసి రాదు. వ్యాపారాలు ఇప్పుడు మొదలు పెట్టకపోవడమే మంచిది.

మీన రాశి : ఈ రాశి వారికీ ఉన్న కష్టాలు సరిపోనట్లు ఇంకా కొత్తవి వస్తాయి. అయినా మీరు అధైర్య పడకండి. దేవుడుని తలచుకుంటూ ఉండండి. భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. ఇంకా ఏ పని మొదలు పెట్టినా కూడా మధ్యలోనే ఆగిపోతోంది. అదృష్టం కూడా అవకాశం చూపి చేతికి అందకుండా పోతోంది ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి. అప్పులు కూడా ఎక్కువవుతాయి.. వివాహం కూడా ఆలస్యం అవుతుంది. వ్యాపారాలు పెట్టె ముందు ఒకసారి ఆలోచించండి. పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)