
ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ ప్రారంభమైంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు భారతీయ సెలబ్రిటీలు ఖతార్‌కు చేరుకున్నారు.

భారత మాజీ క్రికెటర్, ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనున్న లుసైల్ స్టేడియం నుంచి వీడియోను పంచుకున్నారు. శాస్త్రి గతంలో ఖతార్ క్రికెట్ అసోసియేషన్ అధికారులను కూడా కలిశారు.

Sania Mirza

ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఖతార్ చేరుకున్నాడు. అతను ఫ్రాన్స్ లెజెండరీ కోచ్ అర్సేన్ వెంగర్ కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశాడు.

అలాగే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా ఖతార్ చేరుకున్నారు. అతను తన సినిమా పఠాన్‌ను ప్రమోట్ చేయడానికి ఇక్కడకు వచ్చాడు. మ్యాచ్‌కు ముందు, అతను ప్రీ-మ్యాచ్ షోలో ఇంగ్లాండ్ స్టార్ వేన్ రూనీతో కలిసి స్టూడియోలో కనిపించాడు. అలాగే దీపిక కూడా ఫిఫాలో సందడి చేయనుంది.