
ఆరోగ్యకరమైన, ఒత్తైన, పొడవైన జుట్టును కోరుకునే వారికి ఇది మంచి చిట్కా. మెంతులు కేవలం డయాబెటిస్ నియంత్రణకు మాత్రమే కాకుండా, జుట్టు సంరక్షణలో కూడా అద్భుతాలు చేయగలవని ఆయన నొక్కి చెప్పారు. డయాబెటాలజిస్టులు మెంతులకు సంబంధించిన పరిశోధనలు చేసి, డయాబెటిస్ నియంత్రణలో మెంతుల ప్రాముఖ్యతను కూడా నిరూపించారు. అయితే, మెంతులలో జుట్టు ఆరోగ్యానికి సంబంధించి ఇంకా అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయన వెల్లడించారు.

మెంతులు చుండ్రును తగ్గించడానికి, జుట్టును పెంచడానికి , తలలో ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడానికి చాలా మంచివని రుజువు చేశారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి తలలోని ఇన్ఫెక్షన్లు, బలహీనమైన కుదుళ్లు. మెంతులు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలవు.చుండ్రుతో బాధపడేవారికి, తరచుగా తలలో దురదలు, చిన్న కురుపులు, పొక్కులు వచ్చే వారికి ఈ చిట్కా ఎంతో మేలు చేస్తుంది.

ఈ రకమైన బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లను మెంతుల ప్యాక్ తగ్గిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా నిరోధించి, ఇంకా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.రాత్రిపూట మెంతులను పెరుగులో నానబెట్టండి. పెరుగు జుట్టుకు సహజమైన కండిషనర్‌గా పనిచేస్తుంది, మెంతులు మృదువుగా మారడానికి సహాయపడుతుంది.

ఉదయం, నానబెట్టిన మెంతులను మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. దీనికోసం మిక్సీని ఉపయోగించవచ్చు. ఈ మెంతుల పేస్ట్‌లో తగినంత నిమ్మరసం కలపాలి. నిమ్మరసం యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది చుండ్రును తగ్గించడంలో మరియు తలలోని ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

తయారుచేసిన మెంతుల పేస్ట్, నిమ్మరసం మిశ్రమాన్ని తల మాడుకు బాగా పట్టించాలి. జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయాలి. ప్యాక్‌ను అప్లై చేసిన తర్వాత అరగంట నుండి 45 నిమిషాలు లేదా గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. షాంపూ తేలికపాటిది వాడటం మంచిది.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ మెంతుల ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. చుండ్రు తీవ్రత ఎక్కువగా ఉన్నవారు నిరంతరం కొన్ని వారాల పాటు వాడటం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.