నాణాలతో నారాయణుడు ..చూడటానికీ రెండు కళ్లు చాలవే..

Edited By:

Updated on: May 01, 2026 | 3:52 PM

తూర్పుగోదావరి జిల్లా రైతు యర్రంశెట్టి రామకృష్ణ భక్తికి నిదర్శనంగా లక్ష నాణేలతో అద్భుత శ్రీవారి విగ్రహాన్ని రూపొందించారు. 1.08 లక్షల నాణాలతో, నాలుగు అడుగుల ఎత్తులో తీర్చిదిద్దిన ఈ ప్రతిమను 60 రోజుల్లో పూర్తిచేశారు. ఈ కళాఖండాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించనున్నారు. ఇది భక్తులందరికీ ఒక విలక్షణమైన, అపురూపమైన అనుభూతిని ఇస్తుంది.

1 / 5
ఏలూరు : భక్తికి పట్టుదల తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సామాన్య రైతు నిరూపించారు. ఆపదమొక్కులవాడు, ఆ వేంకటేశ్వర స్వామిపై ఉన్న అనన్య సామాన్యమైన భక్తిని వినూత్న రీతిలో చాటుకుంటూ, లక్షలాది నాణేలతో స్వామివారి అపురూప విగ్రహాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరుస్తున్నారు. గోపాలపురం మండలం రాజంపాలెం గ్రామానికి చెందిన రైతు యర్రంశెట్టి రామకృష్ణ చేసిన ఈ అద్భుత ప్రయత్నం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

2 / 5
లక్షకు పైగా నాణాలతో నాలుగు అడుగుల శ్రీవారి ప్రతిమ వృత్తిరీత్యా వ్యవసాయం చేసే రామకృష్ణకు వేంకటేశ్వర స్వామి అంటే అమితమైన ఇష్టం. ఆ భక్తే ఆయనతో ఒక అద్భుత కళాఖండాన్ని రూపొందించేలా చేసింది. కేవలం చిల్లర నాణాలతో స్వామివారి విగ్రహాన్ని మలచాలని సంకల్పించిన ఆయన, కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతర భక్తుల సహకారంతో రూపాయి, ఐదు రూపాయలు మరియు పది రూపాయల నాణాలను సేకరించారు.

3 / 5
సుమారు రూ. 1.50 లక్షల విలువైన దాదాపు 1.08 లక్షల నాణాలను ఉపయోగించి, సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న స్వామివారి విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 19న తన నివాసంలో ఈ నిర్మాణాన్ని ప్రారంభించిన రామకృష్ణ, సుమారు 60 నుండి 65 రోజుల పాటు శ్రమకోర్చి, ప్రతి నాణాన్ని ఎంతో చాకచక్యంగా పేర్చి ఈ విగ్రహాన్ని పూర్తి చేశారు. విగ్రహానికి ప్రత్యేక ఆకర్షణగా వెండితో చేసిన తిరునామం, శంఖు చక్రాలను అమర్చి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తుల కళ్లముందు ఉంచారు.

4 / 5
ద్వారకా తిరుమల దేవస్థానానికి అపురూప కానుక.. నిర్మాణం పూర్తి కావడంతో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్భుత కళాఖండాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కేవలం భక్తితో చేసిన ఈ కృషిని అందరూ కొనియాడుతున్నారు. తన సంకల్పం నెరవేరిన తరుణంలో, ఈ విగ్రహాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించాలని రామకృష్ణ నిర్ణయించుకున్నారు.

5 / 5
ఈ నెల 29, 30 తేదీల్లో గ్రామంలో స్వామివారి విగ్రహాన్ని వేడుకగా ఊరేగించి, అనంతరం 30వ తేదీన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ అధికారులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తుల సందర్శనార్థం ఆలయ అధికారులు ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాణాలతో కొలువుదీరిన ఈ నారాయణుడిని చూడటం ఒక విలక్షణమైన అనుభూతిని కలిగిస్తోందని స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us