
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఒకటి. ఇది భారతీయుల స్వర్గధామం అని చెప్పాలి. తవాంగ్ వేసవి కాలంలో చాలా చల్లగా ఉంటుంది. బౌద్ధ మఠం, ఎత్తైనా కొండలు, పచ్చటి ప్రకృతి మధ్య ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్.

లడఖ్ : లడఖ్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. వేసవి కాలంలో లడఖ్ అందాలు ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటాయి. మంచు, చల్లని వాతావరణం, ఇవన్నీ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇక సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేసుకునే వారు లడఖ్ వెళ్లడం బెస్ట్.

మున్నార్ : మున్నార్ అందాలు వర్ణించలేం. ఎందుకంటే, అంత అద్భుతంగా తేయాకు తోటలు, రైలు ప్రయాణాలు, అందమైన కొండలు, జలపాతాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. కేరళ వేడిగా ఉన్నా కూడా అక్కడి ప్రదేశాలు మాత్రం మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అందుకే తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో మున్నార్ ఒకటి.

స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్ : ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన ప్రదేశం . ఇక్కడ చుట్టూ లోయలు, అందమైన చెట్లు, ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. అందమైన లోయల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి స్పితి లోయ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాలి.

డార్జిలింగ్ , పశ్చిమ బెంగాల్ : కుటంబ సభ్యులతో కలిసి వెళ్లాల్సిన బెస్ట్ ప్లేస్ డార్జిలింగ్. సాంప్రదాయ హిల్ రిసార్ట్. టైగర్ హిల్, టీ తోటలు, ఇవన్నీ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటాయి. అందువలన సమ్మర్‌లో టూర్ వెళ్లాలి అనుకునే వారికి డార్జిలింగ్ బెస్ట్ ప్లేస్.