PF Withdrawal: EPFO లబ్ధిదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ

Edited By:

Updated on: May 10, 2026 | 1:26 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన కోట్లాది మంది చందాదారుల కోసం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే పీఎఫ్ నిధులను ఇకపై నేరుగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది. ఇది ఎప్పుడు అమల్లోకి రానుంచి ఏటీఎం, లేదా యూపీఐ యాప్‌ ద్వారా డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

1 / 6
తన చందాదారుకలు ఈపీఎఫ్‌లో గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ‘ఈపీఎఫ్ఓ 3.0’ పేరుతో ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియను వేగవంతం చేసింది. మే నెల చివరి నాటికి ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం చందాదారులకు ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

2 / 6
అయితే ఈ విధానంలో కొన్ని పరిమితులను కూడా ఈపీఎఫ్‌వో విధించింది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నిల్వలో కేవలం 50 శాతం వరకు మాత్రమే ఈ పద్ధతిలో తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. అత్యవసర సమయాల్లో కార్యాలయాల చుట్టూ తిరగకుండా తక్షణమే నగదు పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.

3 / 6
ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు తమ యూఏఎన్ (UAN) నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని ఈపీఎఫ్‌వో వర్గాలు చెబుతున్నాయి. అలాగే బ్యాంకు ఖాతా, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డుల వివరాలు పీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేసి ఉండడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఏటీఎం ద్వారా నగదు తీసుకునే అవకాశం లభిస్తుంది.

4 / 6
గతంలో పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల సామాన్య ఉద్యోగులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే యూపీఐ ఆప్షన్‌ను కూడా ఇందులో చేర్చారు.

5 / 6
ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వేతన జీవులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ ఏటీఎం కార్డులు సంజీవనిలా పనిచేస్తాయని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

6 / 6
సాంకేతికతను వాడుకుంటూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పారదర్శకతను పెంచుతూనే వేగంగా సేవలు అందించడంలో ఈపీఎఫ్ఓ 3.0 కీలక పాత్ర పోషించనుంది. మే నెల తర్వాత పీఎఫ్ నగదు విత్ డ్రా ప్రక్రియ పూర్తిగా మారిపోనుంది.

Follow Us