
ఏలకుల టీ ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. గొంతునొప్పి, తల నొప్పి, జలుబు, దగ్గుకు ఏలకుల టీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి యాలకులు ఉపయోగపడతాయి.

ఏలకులు, కలకండ కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే వీటిని విడివిడిగా తినడం కంటే యాలకులు, కండను కలిపి తింటే ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట.

ముఖ్యంగా ఏలకుల్లో విటమిన్-సి, నియాసిన్, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఏలకులు, కలకండ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఫలితంగా, మలబద్ధకం సమస్య ఉంటే ఇట్టే మాయం అవుతుంది.

చాలామంది నోటిపూత సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి వారు ఏలకులు, కలకండ కలిపి తినడం వల్ల ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. వీటిల్లో ఉండే గుణాలు నోటి పూత లక్షణాలను తగ్గించడంలో మేలు చేస్తాయి.

ఇందులో విటమిన్-సి కాకుండా, యాంటీ అలర్జీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పికి ఇవి చాలా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయాన్నే యాలకులు, కలకండ కలిపి తినాలి. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఏలకుల్లో విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలను అధికంగా ఉంటాయి. తీపితో ఏలకులు కలిపి తింటే శరీర బలహీనత ఇట్టే తగ్గుతుంది.