బీరకాయ ఎక్కువగా తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..! శరీరంలో జరిగేది తెలిస్తే..

Updated on: Aug 10, 2026 | 9:18 PM

మన వంటింట్లో సులభంగా లభించే కూరగాయల్లో బీరకాయ ఒకటి. చాలామంది దీనిని సాధారణ కూరగా భావించినప్పటికీ, పోషకాహార నిపుణుల ప్రకారం బీరకాయలో శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. బీరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు మరియు దానిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5
జీర్ణ వ్యవస్థకు మేలు: బీరకాయలో పీచు పదార్థం, నీటి శాతం చాలా ఎక్కువ. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. తరచూ అజీర్తి, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి బీరకాయ ఒక మంచి ప్రకృతి సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.

2 / 5
బరువు తగ్గడానికి ఉత్తమం: బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారికి బీరకాయ సరైన ఎంపిక. ఇందులో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. బీరకాయను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి, ఇతర అనవసరమైన కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది.

3 / 5
మధుమేహ నియంత్రణ:  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. షుగర్ ఉన్నవారికి బీరకాయ ఎంతో ప్రయోజనకరం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది.

4 / 5
శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: బీరకాయలో ఉంటే రసాయన గుణాలు కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులోని విటమిన్-ఎ, విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి కాంతివంతంగా ఉంచుతాయి.

5 / 5
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?: బీరకాయను వివిధ రకాలుగా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బీరకాయను టమోటా లేదా పెసరపప్పుతో కలిపి ఇగురుగా తయారు చేసుకోవచ్చు. దీని తొక్కలోని నారను పారేయకుండా నువ్వులు లేదంటే వేరుశనగలతో రుచికరమైన పచ్చడి చేయవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు దీనిని ఉడకబెట్టి హెల్దీ సూప్‌గా తీసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us