Guava Leaves: జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..

|

Jan 09, 2025 | 2:56 PM

జామ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం కాయల్లోనే కాకుండా ఆకుల్లో కూడా బోలెడన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి. జామ చిగురును ప్రతి రోజూ తినడం వల్ల అనేక సమస్యలు రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు..

1 / 5
ఏడాది మొత్తం లభించే పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. కానీ వింటర్‌ సీజన్‌లో ఇవి మరింత ఫ్రెష్‌గా ఉంటాయి. అప్పుడే చిగురు పడుతూ కాయలు వస్తూ ఉంటాయి. జామ కాయలు ఎంతో రుచిగా ఉంటాయి. చవకగా దొరికే పండ్లలో జామకాయలు కూడా ఒకటి.

2 / 5
జామకాయల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. రోజుకు ఒక జామ పండు తిన్నా.. వ్యాధులు, ఇన్పెక్షన్లు త్వరగా ఎటాక్ కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. కేవలం పండ్ల వల్లే కాకుండా జామ చిగురు తిన్నా ఎంతో మంచిది.

3 / 5
జామ చిగురు తింటే జీర్ణ సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. పూర్వం లేత ఆకుల్లో చింత పండు, కారం, ఉప్పు పెట్టుకుని తినేవారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. జామ  చిగురు తింటే గ్యాస్, మలబద్ధకం, అజీర్తి సమస్యలు రావు.

4 / 5
రక్తం కూడా శుభ్రం అవుతుంది. రక్త ప్రసరణ వేగవంతంగా జరుగుతుంది. రక్తంలో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

రక్తం కూడా శుభ్రం అవుతుంది. రక్త ప్రసరణ వేగవంతంగా జరుగుతుంది. రక్తంలో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

5 / 5
శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. హార్ట్ ఎటాక్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు రాకుండా ఉంటాయి. జామ ఆకులు లేదా చిగురును తలకు రాస్తే.. కుదుళ్లు స్ట్రాంగ్‌గా మారతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జామ ఆకులు మరిగించిన నీటిని తాగితే దగ్గు, శ్వాస సమస్యలు, జలుబు తగ్గుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. హార్ట్ ఎటాక్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు రాకుండా ఉంటాయి. జామ ఆకులు లేదా చిగురును తలకు రాస్తే.. కుదుళ్లు స్ట్రాంగ్‌గా మారతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జామ ఆకులు మరిగించిన నీటిని తాగితే దగ్గు, శ్వాస సమస్యలు, జలుబు తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)