కేజీ మటన్, లీటర్ పాలు తాగినా రాని శక్తి.. ఇది గిన్నెడు తింటే బలం రెండింతలవుతుంది

Updated on: Sep 12, 2026 | 2:00 PM

వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ తినాలనిపిస్తే, నల్ల శెనగల చాట్ సరైన మంచిది. ఈ రెసిపీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండింటినీ అందిస్తుంది. నల్ల శెనగలు పోషకాల గని. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

1 / 5
 కావలసిన పదార్థాలు: ఒక కప్పు నల్ల శెనగలు, ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అర టేబుల్ స్పూన్  జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అర టేబుల్ స్పూన్  గరం మసాలా, ఒక పెద్ద  టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ,   కొత్తిమీర తరుగు,  నిమ్మరసంను తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక కప్పు నల్ల శెనగలను తీసుకొని శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి కనీసం రెండు గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత నీళ్లు వంపేసి, కుక్కర్‌లో శెనగలు, ఒకటిన్నర కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. శెనగలు మెత్తగా ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సర్ జార్‌లోకి కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు, చింపిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, బెల్లం, బ్లాక్ సాల్ట్, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5

స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసి వేగించాలి. అవి చిటపటలాడాక, నీళ్లు వంపేసిన ఉడికించిన శెనగలను వేసి కలపాలి. ఇప్పుడు అర టీ స్పూన్ కారం ,ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ చాట్ మసాలా, అర టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

4 / 5

ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్‌ను కూడా వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఒక నిమిషం పాటు వేగించి స్టవ్ ఆఫ్ చేసి పాన్‌ను పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన టమాటా, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు వేయాలి. చివరిగా ఒక నిమ్మకాయ పిండిన నిమ్మరసం లేదా రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. నిమ్మరసం ఈ చాట్‌కు చాలా మంచి రుచిని ఇస్తుంది.

5 / 5
అంతే, వేడివేడిగా, పుల్లపుల్లగా, కారకారంగా ఉండే హెల్దీ నల్ల శెనగల చాట్ రెడీ. దీనిని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని వెంటనే  తినండి.  ఇది సింపుల్‌గా, హెల్దీగా ఉండే అద్భుతమైన స్నాక్. వారానికి ఒకసారి ఇలాంటి చాట్ చేసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి వేడి వేడిగా తినండి.

Loading...
Unable to load recommendations.
Follow Us