Banana Uses: ఖాళీ కడుపుతో అరటిపండు ఇలా తింటే ఎవ్వరికీ తెలియని లాభాలు బోలెడు..!

Updated on: May 03, 2025 | 4:01 PM

అన్ని కాలాలు, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఫ్రూట్‌ అరటి పండు. అందుకే దీనిని పేదవాడి యాపిల్‌ అని కూడా అంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే అద్భుత ఫలం అరటి పండు. అయితే, అరటి పండును కొన్ని రకాల పదార్థాలను కలిపి తినటం వల్ల ఎవరూ ఊహించని ఫలితాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు నల్ల మిరియాలు కలిపి తినటం వల్ల బోలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
Banana

Banana

2 / 5
ఖాళీ కడుపుతో అరటి పండు-మిరియాలు కలిపి తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అరటిలోని ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. నల్ల మిరియాల్లోని పోషకాలు గ్యాస్ట్రిక్‌ రసాలను ప్రేరేపిస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అరటి, మిరియాలు కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.

3 / 5
నల్ల మిరియాల్లో పెపైరిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీవక్రియ రేటు పెంచుతుంది. నల్ల మిరియాలు తింటే కొవ్వు సులువుగా విచ్చిన్నం అవుతుంది. అరటి-మిరియాలు కలిపి తింటే బరువు తగ్గొచ్చు. అరటిలోని ఫైబర్‌ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. నల్ల మిరియాలు జీర్ణ స్రావాల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది.

4 / 5
అరటిపండ్లు తింటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటిపండ్లు- మిరియాలు కలిపి తింటే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. బాడీ డీటాక్సిఫికేషన్‌లో సాయపడతాయి. అరటి పండ్లు-మిరియాలు కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మిరియాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

5 / 5
అరటి పండు- మిరియాలు కలిపి తీసుకుంటే బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఖాళీ కడుపుతో ఈ రెండిటీని కలిపి తీసుకుంటే ఊబకాయం సమస్య ఉండదు. అరటి-మిరియాలు కలిపి తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటి తింటే సెరటోనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండొచ్చు.