
అల్లం.. ఇది ప్రతి వంటింట్లో ఉండే ముఖ్యమైన పదార్థం. ఇది వంటకాలకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే దీన్ని వాడేప్పుడు తొక్క తీయడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇవి స్ట్రెయిట్‌గా కాకుండా వంకరటింకర ఆకారంతో ఉండడం కారణంగా కత్తి లేదా పీలర్‌తో దీన్ని తీయడం కాస్త కష్టమవుతుంది. అలాగే కొన్ని సార్లు అల్లం కూడా వేస్ట్ అవ్వొచ్చు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు ఈజీగా అల్లం తొక్కను తీసేయవచ్చు.

అల్లం తొక్క తీయడంలో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఉపయోగిస్తారు. కొందరు కత్తితో తీస్తే.. మరి కొందరు పీలర్‌తో తీస్తారు. కానీ వీటన్నింటికంటే మీరు ఇంట్లో దొరికే స్పూన్ ఉపయోగించి ఈజీగా అల్లం తొక్కను తీసేయవచ్చు. ఇందుకోసం ఇంట్లో ఉండే ఓ స్పూన్ తీసుకొని అల్లం అంచులపై నెమ్మదిగా గీస్తే తొక్క ఈజీగా తొలగిపోతుంది. అయితే స్పూన్‌తో తీయడం వల్ల అల్లం అనేది వేస్ట్ అవ్వదు.

ఒకవేళ అల్లం ముక్కలు పెద్దవిగా ఉన్నా లేదా వంపులు తిరిగి ఉన్నా.. వాటిని చిన్న ముక్కలుగా విరిచేయండి. ఆ ముక్కలను చేతిలో పట్టుకొని స్పూన్ సహాయంతో నెమ్మదిగా తొక్కపై గీయండి. అప్పుడు తొక్క ఈజీగా తొలగిపోతుంది. అయితే తొక్క మరింత సులభంగా రావాలి అంటే.. అల్లం గీరే అరగంట ముందు దాన్ని నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల తొక్క త్వరగా ఊడిపోతుంది.

అయితే వెజిటబుల్ పీలర్‌తో కూడా మీరు అల్లం తొక్కను తొలగించవచ్చు. ఇందుకోసం వంకరగా ఉన్న అల్లంను చిన్న ముక్కలుగా విరిచి వాటిని నీటిలో నానబెట్టండి. అరగంట తర్వాత వెజిటబుల్ పీలర్ తీసుకొని దాని సహాయంతో నిదానంగా గీయండి. అయితే మీరు పీలర్‌తో ఎక్కువ గట్టిగా నొక్కకండి అలా చేయడం వల్ల అల్లం వేస్ట్ కావచ్చు. కాబట్టి నెమ్మదిగా ప్రెస్ చేస్తూ గీయండి. అప్పుడు తొక్క ఈజీగా తొలగిపోతుంది.

మీకు డబ్బులు వేస్ట్ అవ్వకుండా, అల్లం వృథా కాకుండా ఉండాలంటే వీటన్నింటిలో మీకు స్పూనే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే స్పూన్‌తో అల్లం వేస్ట్ అవ్వదు. ఇవి మన ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనాల్సిన పని ఉండదు. అంతేకాదు అల్లం వంకరగా ఉన్నప్పటికీ మీరు స్పూన్ సహాయంతో ఈజీగా తొలగించవచ్చు.