
కావాల్సిన పదార్ధాలు : 8 వంకాయలు, 200 గ్రాముల శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా ఉప్పు, బజ్జీలకు సరిపడా నూనెను తీసుకోవాలి.

ముందుగా వంకాయలను తీసుకుని వాటిని నీటితో కడిగి తొడిమలు తీసి వాటిని ఐదు భాగాలుగా చీల్చాలి. అలాగే, రోటిలో వాము, ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసుకుని దంచుకోవాలి

ఆ తర్వాత చీల్చిన వంకాయలను తీసుకుని వాము పొడి వేసిన మిశ్రమాన్ని నింపాలి. రుచిని బట్టి కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పును వెయ్యాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, సోడా ఉప్పు , మంచి నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరి మరి జోరుగా కాకుండా నార్మల్ గా కలుపుకోవాలి.

స్టవ్ వెలిగించి పాన్ లో నూనెను వేడి చేసి వంకాయలను శనగ పిండిలో ముంచి నూనెలో కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి బజ్జీ రెడీ.