Skin Care: ఇంట్లో తక్కువ ధరకు దొరికే దీంతోనే మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..

|

Dec 16, 2024 | 4:57 PM

అందాన్ని పెంచుకోవాలంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మన ఇంట్లోనే చుట్టు పక్కల ఉండే వాటితో ఈజీగా పెంచుకోవచ్చు. మన ఇంట్లో ఎన్నో రకాల పదార్థాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి తక్కువ ఖర్చుతోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..

1 / 5
అందంగా ఉండాలని పురుషులు, ఆడవాళ్లు కూడా అనుకుంటూ ఉంటారు. అందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే లోపలి నుంచి మంచి గ్లో వస్తుంది. ఈ గ్లో కోసం బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఖరీదైన క్రీములు కొనక్కర్లేదు.

2 / 5
మన ఇంట్లో తక్కువ ధరకు దొరికే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. వీటి కోసం పెద్దగా కష్ట పడాల్సిన పని లేదు. మనకు ఈజీగానే లభిస్తాయి. అలా ఇంట్లో ఉండే వాటిల్లో జాజికాయ కూడా ఒకటి. దీన్ని ఎక్కువగా పులావ్ దినుసుల్లో రుచి కోసం వాడుతూ ఉంటారు.

3 / 5
ఈ జాజికాయతోనే మన అందాన్ని పెంచుకోవచ్చు. ఈ జాజికాయను పలు రకాల బ్యూటీ ప్రాడెక్ట్స్‌లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో అనేక ఔషధ గుణాలు మనకు లభిస్తాయి. ముఖంపై ఉండే మచ్చలు, ముడతలు, పింపుల్స్, డెడ్ స్కిన్స్ సెల్స్ తొలగించడంలో ఇది చక్కగా పని చేస్తుంది.

4 / 5
జాజికాయ పొడిని, కొద్దిగా చందనం పొడిని ఓ గిన్నెలో నీళ్లు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా ముఖాన్ని పట్టించి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా అరగంట సేపు వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి. జాజికాయ పొడిలో కూడా రోజ్ వాటర్ లేదా మిల్క్, తేనె కూడా కలపొచ్చు.

5 / 5
ఇలా వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకున్నా.. మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి. చర్మం సాఫ్ట్‌గా మారుతుంది.