మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రం చెబుతున్న అసలు నిజం ఇదే!

Updated on: Mar 15, 2026 | 10:16 AM

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే, ఈ మొక్కను పెంచే విషయంలో కొన్ని వింతైన నమ్మకాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానమైనది. మనీ ప్లాంట్‌ను దొంగిలించి నాటాలి. ధనవంతుల ఇళ్ల నుండి చిన్న కొమ్మను దొంగతనంగా తెచ్చి ఇంట్లో నాటితే, వారి సంపద మన ఇంటికి వస్తుందని కొందరు భావిస్తారు. మరి ఇందులో నిజమెంత? వాస్తు శాస్త్రం దీని గురించి ఏమంటోంది? ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
దొంగతనం చేస్తే ఫలితం ఉండదు: వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ దొంగిలించి తీసుకురాకూడదు. దొంగతనం అనేది ఒక తప్పుడు పని, ఇది నెగెటివ్ వైబ్రేషన్లను కలిగి ఉంటుంది. తప్పుడు మార్గంలో తెచ్చిన మొక్క ఇంట్లో సానుకూల శక్తిని ఇవ్వదు సరిగ్గా, పైగా అది ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కను మీ స్వార్జితంతో కొనుగోలు చేసి నాటుకోవడం వల్లనే పూర్తి ఫలితం ఉంటుంది. ఈ మొక్కను డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి నాటుకోవడం అత్యంత శుభప్రదం. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

2 / 5
మనీ ప్లాంట్ పెంచేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు: సరైన దిశ: మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశ (South-East) లో ఉంచడం శుభప్రదం. ఈ దిశకు వినాయకుడు అధిపతి, శుక్రుడు పాలకుడు. కాబట్టి, ఇది సంపదను ఆకర్షిస్తుంది. ఈశాన్య దిశలో మాత్రం అస్సలు ఉంచకూడదు.

3 / 5
తీగలు పైకి ఉండాలి: మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ కిందికి పారకూడదని, అవి పైకి పాకేలా చూడాలని, అప్పుడే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ తీగలు అభివృద్ధికి చిహ్నం. కాబట్టి అవి నేలను తాకకుండా, పైకి పాకేలా ఏదైనా ఆధారం ఏర్పాటు చేయాలి. తీగలు కిందికి వేలాడటం ఆర్థిక నష్టానికి సంకేతంగా పరిగణిస్తారు.

4 / 5
ఎండిన ఆకులు తొలగించాలి: మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఆకులు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారినా వెంటనే వాటిని తొలగించాలి. ఎండిన మొక్క ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుంది.  మనీ ప్లాంట్ మొక్కను ఉదయం లేదా సాయంత్రం వేళలో నాటడం మంచిది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, శుక్రవారం రోజున మనీ ప్లాంట్‌ను నాటడం శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.

5 / 5
వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ కి పోసే నీటిలో కొద్దిగా పాలు కలిపితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ కేవలం ఒక అందమైన మొక్క మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన వాస్తు సాధనం. దానిని సరైన పద్ధతిలో, సరైన దిశలో నాటితేనే మీ ఇంట్లో ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది. ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదని, అలా ఇస్తే మీ ఇంట్లోని ఐశ్వర్యం ఇతరుల పాలు అవుతుందని ఒక నమ్మకం ఉంది.

Follow Us