
టపాసులు పేల్చడం వలన గాలి పొగతో, ధూళి కణాలతో నిండి పోతుంది. ఇక ఫెస్టివల్ ఎంజాయ్ మెంట్లో చాలా మంది తమ స్కిన్ గురించి అంతగా కేర్ తీసుకోరు. దీంతో పొగ, దుమ్మ వలన చర్మం పొడిబారడం, బిగుసుక పోయినట్లు అనిపిస్తుంది. దీంతో మరుసటి రోజు చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్ ఉపయోగిస్తూ, చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తూ మీ చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చునంట. అది ఎలా అంటే?

దీపావళి సమయంలో చాలా మంది బయట నుంచి వచ్చిన తర్వాత పదే పదే ముఖాన్ని శుభ్ర పరుస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు,కఠినమైన క్లెన్సర్‌ను ఉపయోగించకుండా కేవలం బియ్యం నీరు వంటి వాటితో తేలికగా మీ చర్మాన్ని శుభ్ర పరుచుకోవడం వలన చర్మపు పొర బలహీన పడకుండా ఉంటుంది.

అదే విధంగా చాలా మంది పండుగనే కదా అని ఇంటిలో స్కిన్ కేర్ తీసుకోకుండా ఉంటారు. అయితే దీపావళి పండుగ సమయంలో తప్పకుండా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. దీని వలన చర్మ రక్షణ పొర బలంగా ఉంటుంది. అంతే కాకుండా టపాసుల పొగ నుంచి వచ్చే కాలుష్యం నుంచి కాపాడుతుంది. చర్మానికి సహజ తేమ, రక్షణను అందిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసి, సన్ స్క్రీన్ వాడటం చాలా అవసరం.

చాలా మంది చర్మానికి సంరక్ష అంటే కేవలం బయట నుంచి మాత్రమే అనుకుంటారు. కానీ లోపలి నుంచి కూడా జరగాలి. అందువలన ప్రతి రోజూ తప్పకుండా మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. డైట్లో తప్పనిసరిగా నారింజ, బెర్రీస్, బొప్పాయి తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన శరీరానికి ఇవి చాలా మేలు చేస్తాయి.

పండుగ సమయంలో చాలా మంది అందంగా రెడీ అవుతూ ఉంటారు. ముఖ్యంగా పార్టీల కోసం హెవీ మేకప్ వేస్తుంటారు. కానీ ఈ సమయంలో తప్పకుండా, నాన్-కామెడోజెనిక్, బ్రీతబుల్ ప్రొడక్ట్స్ నే ఎంచుకోండి. ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ కు బదులు అవసరమైన చోట మాత్రమే కన్సీలర్ వాడండి. రాత్రి పడుకునే ముందు మేకప్ పూర్తిగా తొలగించి, మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకండి. లేకపోతే చర్మం దెబ్బతినే ఛాన్స్ ఉంది.