డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక గింజలు, ఎండిన పండ్లు, విత్తనాలు కూడా ఉంటాయి. కానీ వీటిల్లో ఎక్కువ ప్రయోజకరమైనవి ఏంటో తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకుంటే అత్తి పండ్లను (అంజీర్) తినడం ప్రారంభించండి. అత్తిపండ్లు రక్తంలో అదనపు చక్కెరను గ్రహిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అంజీర్ పండ్లలో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్లు సి, కె, ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.