Multani Mitti: అందం కోసం ముల్తానీ మిట్టిని రోజూ వాడుతున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..!

|

Jun 25, 2024 | 12:47 PM

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మొటిమలు, మచ్చల కారణంగా వారి అందం తగ్గిపోతుంది. దీన్ని నివారించడానికి, ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి చాలా ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అలాంటి వారిలో కొందరు కేవలం ముల్తానీ మిట్టిని క్రమం తప్పకుండా వాడుతూ ఉంటారు..కానీ, ఇది సరైనది కాదు.. ముల్తానీ మిట్టిని రోజూ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముల్తానీ మిట్టి వల్ల కలిగే కొన్ని నష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
ముల్తానీ మట్టిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కొత్త సెల్స్ గ్రోత్ ను పెంపొందిస్తుంది. దాంతో స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది. ముల్తానీమట్టితో స్క్రబ్బింగ్ చేస్తే డెడ్ సెల్స్ సమస్య తొలగిపోతుంది. స్కిన్ కు వైబ్రెంట్ లుక్ లభిస్తుంది.

2 / 5
అయితే, మార్కెట్లో అనేక రకాల ముల్తానీ మిట్టిలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీ చర్మానికి అనుగుణంగా ఉండే ముల్తానీ మిట్టిని ఎంచుకోవాలి. ఎందుకంటే ఎదిపడితే అది ముల్తానీ మిట్టిని ఎంచుకోవడం వల్ల చర్మంపై వాపు, ఎరుపు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. ముల్తానీ మిట్టిని తప్పుగా ఉపయోగించడం వల్ల ముఖంపై ఎర్రటి మొటిమలు ఏర్పడతాయి.

3 / 5
ముల్తానీ మిట్టి చర్మంలోని సహజ నూనెను గ్రహించేలా పనిచేస్తుంది. పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టిని ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే మీరు ప్రతిరోజూ ముల్తానీ మిట్టిని ఉపయోగిస్తే.. మీ చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. కొంతమందికి ముల్తానీ మిట్టికి అలెర్జీ ఉండవచ్చు.

4 / 5
ముల్తానీ మిట్టిని ముఖానికి రాసుకుని ఎండలోకి వెళ్తే చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది. అందువల్ల ముల్తానీ మిట్టిని చర్మానికి అనుగుణంగా ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే ముల్తానీ మిట్టిని చర్మానికి వాడాలి. మీరు దీన్ని తరచుగా ఉపయోగిస్తే.. చర్మం పొడిబారవచ్చు. ముల్తానీ మిట్టిని నేరుగా మీ చర్మంపై అప్లై చేయడం మానుకోవాలి. దీనికి బదులుగా ముల్తానీ మిట్టిలో రోజ్ వాటర్, పెరుగును ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు.

5 / 5
అంతేకాదు, ముల్తానీ మిట్టిన జుట్టు సమస్యకి పరిష్కారంగా కూడా వాడుతుంటారు. దీంతో చాలా జుట్టు సమస్యలు దూరమవుతాయి. ఆయిల్ స్కాల్ఫ్ ఉన్నవారికి ముల్తానీ మట్టి బెస్ట్ సొల్యూషన్. మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మురికి, నూనెని దూరం చేస్తుంది. అయితే, డ్రై హెయిర్ ఉన్నవారు దీనిని వాడకపోవడం మంచిది. దీనివల్ల స్కాల్ఫ్ మరింత పొడిగా మారుతుంది.