సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే అద్భుత ఆయుర్వేద ఔషధం!

Updated on: Oct 08, 2026 | 3:18 PM

సీతాఫలం అనగానే మనకు కేవలం తీపి పండు మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఆయుర్వేదం ప్రకారం సీతాఫలం చెట్టు ఆకులు ఆరోగ్యానికి గొప్ప వరప్రసాదం. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ జీవితంలో ఈ ఆకులను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అనేక దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

1 / 5
రక్తపోటు తగ్గుతుంది: సీతాఫలం పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా, సీతాఫలం ఆకులలో కూడా అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఈ ఆకులలో ఉండే పొటాషియం, మెగ్నిషియం రక్తనాళాలను ప్రశాంతపరిచి, రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

2 / 5
చర్మ సమస్యలు, గాయాలకు నివారణ: సీతాఫలం ఆకులలోని యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మ వ్యాధులను నివారిస్తాయి. ఈ ఆకుల పేస్టును దద్దుర్లు, తామర, మొటిమలు ఉన్న చోట రాస్తే సమస్య త్వరగా తగ్గుతుంది. అలాగే గాయాలపై ఈ పేస్టు అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా త్వరగా మానడానికి దోహదపడుతుంది.

3 / 5
డయాబెటిస్ అదుపులో ఉంటుంది: సీతాఫలం ఆకులు మధుమేహ గ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని నీటిలో మరిగించి కాషాయంలా తయారుచేసి తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది శరీరంలో సహజ ఇన్సులిన్‌లా పనిచేసి టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

4 / 5
జీర్ణక్రియ, లివర్ ఆరోగ్యం: సీతాఫల ఆకుల కషాయం తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు నయమవుతాయి. అలాగే ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి.

5 / 5
దంత ఆరోగ్యం, కీళ్ల నొప్పులు: ఈ ఆకులను నమలడం వల్ల దంత క్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు తగ్గి నోటి పరిశుభ్రత పెరుగుతుంది. ఆకుల పేస్టును వాపులు, కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో అప్లై చేయడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల ద్వారా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని శుభ్రమైన సీతాఫలం ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, వడకట్టి కషాయం రూపంలో లేదా రోజువారీ హెర్బల్ టీలా తీసుకోవచ్చు. అయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో దీనిని వాడటం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us