నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది రెండు ప్లేట్స్ లాగిస్తారు

Updated on: Oct 21, 2026 | 11:29 AM

పెసర గారెలు, సంప్రదాయ ఆంధ్ర వంటకాల్లో ఒకటి. ఇవి మినప గారెల కంటే తేలికగా, రుచిగా, తక్కువ నూనెతో చేసుకోవచ్చు. ముఖ్యంగా, నూనె పీల్చకుండా కరకరలాడే గారెలు ఈ వంటకం ప్రత్యేకత. దీనికి ఘాటైన కారం చట్నీ తింటే, ఉదయం టిఫిన్, సాయంత్రం పూట అల్పాహారం మరింత కమ్మగా మారుతుంది. ఈ రెసిపీలో పెసర గారెలు, కారం చట్నీ తయారీ విధానాన్ని ఇక్కడ చూద్దాం..

1 / 5
పెసర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు:  పెసరపప్పు - 400 గ్రాములు ,  తరిగిన ఉల్లిపాయలు - 1 పెద్దది, అల్లం - 1 అంగుళం ముక్క,  పచ్చిమిర్చి - 6,  తరిగిన కొత్తిమీర - కొద్దిగా,  జీలకర్ర - అర చెంచా,  ఉప్పు - రుచికి సరిపడా, నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోవాలి.  400 గ్రాముల పెసరపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం మూడు గంటల పాటు నానబెట్టాలి. మిక్సీలో రుబ్బుకోవడానికి మూడు గంటలు నానబెట్టడం ముఖ్యం, లేదంటే పిండి గట్టిగా వస్తుంది. ఒకవేళ గ్రైండర్‌లో రుబ్బాలి అనుకుంటే రెండు గంటలు సరిపోతుంది.

2 / 5
పప్పు బాగా నానిన తర్వాత, దానిని శుభ్రంగా కడిగి, చిల్లుల గిన్నెలో వేసి 10-15 నిమిషాల పాటు నీళ్లు పూర్తిగా వాడే వరకు ఉంచాలి. పిండి లూజ్‌గా అవ్వకుండా ఉండటానికి ఇది చాలా అవసరం. ఈ దశలో సుమారు రెండు చెంచాల నానిన పెసరపప్పును పక్కన పెట్టుకోవాలి. ఇది గారెలకు మంచి ఆకృతినిస్తుంది.

3 / 5

 అదే సమయంలో, ఒక మిక్సీ జార్‌లో అల్లం ముక్క,  పచ్చిమిర్చి వేసి, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది గారెలకు మంచి రుచిని, ఘాటును ఇస్తుంది.ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో నీరు వాడిన పెసరపప్పును కొద్దికొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, చేతికి కొద్దిగా రవ్వ రవ్వగా తగిలేలా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బితే గారెలు ఆకృతిని పట్టుకోవు. రుబ్బుతున్నప్పుడు నీళ్లు కలపకుండా చూసుకోవాలి, పిండి గట్టిగా ఉండాలి.

4 / 5

 రుబ్బిన పెసరపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో పక్కన పెట్టుకున్న పప్పు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మరియు కచ్చాపచ్చాగా రుబ్బిన అల్లం-పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే, సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవచ్చు. గారెలు వత్తడానికి అరిటాకు, కవర్ లేదా బటర్ పేపర్‌ను ఉపయోగించవచ్చు. చేతిని నీళ్లతో తడిపి, కొద్దిగా పిండి తీసుకుని, అరిటాకుపై పల్చగా వత్తి, మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. గారెలు పల్చగా ఉంటేనే నూనె పీల్చకుండా, కరకరలాడతాయి.

5 / 5
డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు తగ్గించి, వత్తుకున్న గారెలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఒకవేళ చేత్తో వేయడం కష్టంగా అనిపిస్తే, అట్లకాడ వంటి గరిటెను ఉపయోగించి దానిపై వత్తి నూనెలో వేయాలి. గారెలు రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, నూనె నుండి తీసివేయాలి. మీడియం ఫ్లేమ్‌లో వేయించడం వల్ల అవి లోపల వరకు ఉడికి, నూనె పీల్చుకోవు.

Loading...
Unable to load recommendations.
Follow Us