Pappu Chegodilu: స్వీట్ షాప్ కంటే రుచిగా.. ఇంట్లోనే చేసే పప్పు చేగోడీలు

Updated on: Oct 27, 2026 | 9:20 PM

తెలుగువారి సాంప్రదాయ పిండివంటలలో చేగోడీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా పైన పచ్చిశనగపప్పు అంటివుండే 'పప్పు చేగోడీలు' స్వీట్ షాపుల్లో కొనేదానికంటే ఎంతో రుచిగా, క్రిస్పీగా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో తయారుచేసుకోవచ్చు. చాలామంది చేగోడీలు వేసినప్పుడు నూనెలో విడిపోతాయని, లేదా వేగిన తర్వాత మెత్తబడిపోతాయని బాధపడుతుంటారు. ఈ చిన్న చిన్న మెళకువలు పాటిస్తే మొదటిసారి చేసినా కూడా ప్రతి చేగోడీ పర్ఫెక్ట్ రౌండ్ షేప్‌లో, కరకరలాడుతూ అద్భుతంగా వస్తుంది.

1 / 6
కావలసిన పదార్థాలు: అర కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు బియ్యప్పిండి, అర కప్పు మైదా పిండి , పిండి పరిమాణానికి సమంగా 1½ కప్పులు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ కారం పొడి, స్వీట్ షాప్ లుక్ కోసం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్, పిండి కలపడానికి 2 నుండి 3 టీస్పూన్ల వంట నూనె, డీప్ ఫ్రైకి సరిపడా  నూనె

2 / 6
తయారీ విధానం: ఒక గిన్నెలో అర కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 2 నుండి 3 గంటలు నానబెట్టాలి. పప్పు చక్కగా నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి.. ఒక పొడి కాటన్ క్లాత్‌పై తడి ఏమాత్రం లేకుండా 10 నిమిషాలు ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో 1 కప్పు బియ్యప్పిండి, అర కప్పు మైదా పిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ కారం, చిటికెడు ఫుడ్ కలర్ వేసి హై ఫ్లేమ్‌పై నీటిని మరగనివ్వాలి.

3 / 6
నీళ్లు మరగడం ప్రారంభించగానే.. ఒక చేత్తో పిండిని కొద్దికొద్దిగా పోస్తూ మరో చేత్తో గరిటెతో ఉండలు కట్టకుండా వేగంగా కలపాలి. పిండి అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. గోరువెచ్చగా ఉన్న పిండిలో 2 నుండి 3 టీస్పూన్ల నూనె వేసి చేత్తో బాగా ఒత్తుతూ కలపాలి ఎక్స్‌ట్రా నీళ్లు అవసరం లేదు, ఒకవేళ గట్టిగా అనిపిస్తే చెంచాడు నీళ్లు చిలకరించుకోవచ్చు. పిండిని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ ముద్దలా తయారుచేసి.. ఆరిపోకుండా తడి గుడ్డ లేదా మూతపెట్టి ఉంచాలి.

4 / 6
 కొద్దిగా పిండి ముద్దను తీసుకుని చపాతీ పీటపై చేతులతో మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా ఉండేలా తాళ్చాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న పచ్చిశనగపప్పును పీటపై వేసి.. తాళిన పిండిని పప్పుపై రోల్ చేస్తే శనగపప్పు పిండికి చక్కగా అంటుకుంటుంది. కావలసిన సైజులో కట్ చేసుకుని రెండు చివర్లను ఒకదానిపై ఒకటి పెట్టి గట్టిగా అతికించి రౌండ్ రింగ్ షేప్ చేసుకోవాలి.చివర్లు అతికించే చోట పప్పు లేకుండా పిండిని పిండితోనే అతికిస్తే నూనెలో విడిపోవు.

5 / 6
కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడిచేయాలి. చిన్న పిండి ముద్ద వేస్తే వెంటనే పైకి తేలేలా నూనె కాగిన తర్వాత.. సిద్ధం చేసుకున్న చేగోడీలను ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. కడాయికి సరిపడా వేయాలి, మరీ ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అంటుకుంటాయి.

6 / 6
వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు; రెండు నిమిషాలు మీడియం మంటపై వేగాక నెమ్మదిగా రెండో వైపుకు తిప్పాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన రంగు వచ్చి లోపల మెత్తగా ఉండిపోతాయి, కాబట్టి మీడియం మంటపైనే నూనె పై నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు నిదానంగా వేయించాలి. ఒకటి విరిచి చూస్తే లోపలి వరకు క్రిస్పీగా వేగినట్లు నిర్ధారించుకుని జల్లి గరిటెతో ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే కరకరలాడే 'పప్పు చేగోడీలు' సిద్ధం! పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు ఎంతో క్రిస్పీగా ఉండి సాయంత్రం వేడివేడి టీతో నంజుకుని తింటుంటే అద్భుతమైన రుచినిస్తాయి!

Loading...
Unable to load recommendations.
Follow Us