ఆలూ స్టఫింగ్‌తో కరకరలాడే మినీ కచోరీలు.. పొరలు పొరలుగా క్రిస్పీ స్నాక్స్!

Updated on: Oct 25, 2026 | 5:18 PM

సాయంత్రం టీ సమయానికి సరైన, తక్కువ శ్రమతో కూడుకున్న, రుచికరమైన స్నాక్ కోసం చూస్తున్నారా? అయితే క్రిస్పీ, లేయర్‌డ్ మినీ కచోరి మీకు సరైన ఎంపిక. ఈ రెసిపీని చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ముక్కలోనూ వచ్చే కరకరలాడే రుచి మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది..

1 / 5
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమపిండి లేదా మైదాపిండి తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి, పిండిలో బాగా కలిసేలా చేతులతో కలపండి. తర్వాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ, చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోండి. పిండిని బాగా గట్టిగా కలుపుకోవడం వల్ల కచోరీలు క్రిస్పీగా వస్తాయి. కనీసం ఐదు నిమిషాల పాటు బాగా కలపండి. పిండి కలిపిన తర్వాత, దానిపై పావు స్పూన్ నూనె రాసి, లోపలి వైపు మడిచి, మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా నాని, సులభంగా రోల్ చేయడానికి వీలవుతుంది.

2 / 5
పిండి నానిన సమయంలో, బంగాళదుంప స్టఫింగ్‌ను సిద్ధం చేసుకోండి. ముందుగా కొన్ని బంగాళదుంపలను ఉడకబెట్టి, పొట్టు తీసి మెత్తగా మ్యాష్ చేయండి లేదా తురుముకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, కడాయి పెట్టి, రెండు స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి వేసి, దోరగా వేయించండి. తర్వాత ఒకటిన్నర స్పూన్ కూర కారం (లేదా పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి) వేసి పచ్చివాసన పోయేవరకు వేయించండి.

3 / 5
ఇప్పుడు మ్యాష్ చేసిన బంగాళదుంప తురుమును వేసి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. స్టఫింగ్ బాగా దగ్గరపడి, పొడిగా అయిన తర్వాత, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఒక చిన్న బౌల్‌లో రెండు మూడు స్పూన్ల మైదాపిండి, మూడు స్పూన్ల నూనె (లేదా కొద్దిగా నీరు) వేసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని బ్యాటర్ సిద్ధం చేసుకోండి. ఇది కచోరీలకు పొరలు రావడానికి సహాయపడుతుంది.

4 / 5
నానిన పిండిని మరోసారి కలిపి, నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోండి. కొద్దిగా పొడిపిండి జల్లుకొని, చపాతీలా పల్చగా రోల్ చేయండి. దీనిపై ముందుగా సిద్ధం చేసుకున్న మైదా, నూనె మిశ్రమాన్ని ఒక స్పూన్న్నర వరకు వేసి చపాతీ అంతా రాయండి. ఇప్పుడు చపాతీని ఇరువైపుల నుంచి మడిచి, మళ్లీ మధ్యలోకి మడవండి. దీన్ని తిరిగి చపాతీ కర్రతో కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ రోల్ చేయండి. రోల్ చేసిన చపాతీ మధ్యలో ఒకటిన్నర స్పూన్ బంగాళదుంప స్టఫింగ్ పెట్టి, చిగురు నుంచి మొత్తం కవర్ అయ్యేలా ఫోల్డ్ చేయండి. అదనపు పిండి ఉంటే తీసివేయండి, లేదా లోపలికి మడిచి చేతితో కొద్దిగా నొక్కండి. అన్ని కచోరీలను ఇదే విధంగా తయారు చేసుకోండి.

5 / 5
డీప్ ఫ్రై కోసం నూనెను గోరువెచ్చగా ఉండేలా వేడి చేయండి. తయారు చేసుకున్న కచోరీలను వేసి, తక్కువ నుంచి మీడియం ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాలు కదపకుండా ఉంచండి. ఒక వైపు మంచి రంగు వచ్చాక, రెండో వైపు తిప్పి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు, కరకరలాడే వరకు వేయించండి. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే ఈ క్రిస్పీ మినీ కచోరీల రుచి అద్భుతంగా ఉంటుంది. ప్రతి ముక్కలోనూ పొరలు పొరలుగా వచ్చి, తినేకొద్దీ తినాలనిపిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us