
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ తయారు చేసుకోవచ్చునంట. కాగా, దీనిని తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రెండు కప్పుల మైదా, టీ స్పూన్ శనగపిండి, కప్పు పెరుగు, యాలకుల పొటి వన్ టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు, ఫుడ్ కలర్. నిమ్మరసం, పంచదార.

తయారీలోకి వెళితే .. మందుగా మైదా పిండి తీసుకోవాలి. ఒక బౌల్‌లో వేసి చిటికెడు నెయ్యి, శనగపిండి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి, అచ్చం పకోడీ వేసుకునే పిండి విధానంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనిని రెండు రోజుల పాటు పులిగ బెట్టాలి.

రెండు రోజుల తర్వాత పిండిని తీసుకోవాలి. అందులో ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని జిలేబీ ఆకారంలో ఒత్తుకోవడానికి ఒక కవర్ లేదా క్లాత్ తీసుకొని దానికి చిన్న హోల్ చేసి, సరైన ఆకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత దానిపై పాన్ పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్ లేదా కవర్ తీసుకొని అందులో పిండి నింపి, జిలేబీల ఆకారంలో ఒత్తుకోవాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా జిలేబీలను పూర్తిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం, ఒక పాన్ తీసుకోవాలి. అందులో సరిపడ నీళ్లు పోసి, మరిగే సమయంలో చక్కర వేయాలి. చక్కెర పూర్తిగా కరిగి, గులాబ్ జాముల్లా తీగ పాకం వచ్చే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. అది తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. తర్వాత అందులో జిలేబీలు వేసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ జిలేబీలు రెడీ.