ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?

Updated on: Jul 23, 2026 | 6:58 PM

తొలి ఏకాదశి పండుగ వచ్చేస్తుంది. అయితే ఈ సమయంలో తెలంగాణలో పిండి వంటలు చేస్తుంటారు. రక రకాల పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు. కాగా, ఇప్పుడు మనం ఏకాదశి సందర్భంగా చిట్టి చిట్టి మురుకులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : అటుకులు, శనగపప్పు, కారం, ఓమ, నవ్వులు, బిచ్యం పిండి, ఉప్పు, నూనె, నీళ్లు. ఈ పదార్థాలతో చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే చిన్న చిన్న మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పుట్నాల పప్పు, శనగపప్పు, అటుకులు తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి, ఇది  మొత్తం కలిపి మంచిగా కలుపుకోవాలి.

3 / 5
తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ నువ్వులు, జీలకర్ర, ఓమా, కారం, ఉప్పు, అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్లు పోస్తూ మంచిగా కలుపుకోవాలి. గరిటతో  కలుపుతూ, మంచిగా మురకులు మంచిగా వచ్చేలా కాస్త వదులుగా కలుపుతూ కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత దీనిని ఒక పది హేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి  పాన్ పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె బాగా వేడి అయ్యే వరకు మంచిగా కాలనివ్వాలి. నూనె బాగా కాలిన తర్వాత, పిండిని తీసుకోవాలి. మురుకులు చేసుకునే గొట్టంలో పిండిని వేసుకోవాలి. చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి.

5 / 5
అటూ, ఇటు తిప్పుతూ, మురుకులు బాగా కాల్చుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. తరవాత వాటన్నింటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయించుకోవాలి. దానిని ఈ మురుకుల మీద చల్లుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ  చిట్టి చిట్టి మురుకులు రెడీ. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా తింటారు.

Follow Us