
బెండకాయలు: కిలో, ఎండు మిరపకాయలు: 7 , నూనె: 2 టేబుల్‌స్పూన్లు, పల్లీలు: 1 టేబుల్‌స్పూన్, ఆవాలు: 1/2 టీస్పూన్, మినప్పప్పు: 1/2 టీస్పూన్, పచ్చిశనగపప్పు: 1/2 టీస్పూన్, జీలకర్ర: 1/4 టీస్పూన్,ఎండు మిరపకాయ: 1, పచ్చిమిర్చి: 1 ,ఉల్లిపాయ: 1 , కరివేపాకు: కొద్దిగా, పసుపు పొడి: 1/4 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: 8, ఉప్పు: రుచికి సరిపడా, ధనియాల పొడి: 1/2 టీస్పూన్, ఎండు కొబ్బరి పొడి: 1/2 టీస్పూన్.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా కేజీ బెండకాయలను తీసుకోవాలి. 1/2 కిలో బెండకాయలను నీట్‌గా కడిగి, ఒక పొడి క్లాత్‌తో తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి ఉండటం వల్ల బెండకాయలు జిగురుగా మారతాయి, కాబట్టి తడి లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇలా చేస్తే వేపుడు క్రిస్పీగా వస్తుంది.

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, రెండు టేబుల్స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక, ఒక టేబుల్‌స్పూన్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు వేపుడు రుచిని పెంచుతాయి. అదే నూనెలో, కట్ చేసిన బెండకాయ ముక్కలను రెండుసార్లుగా వేసి వేయించాలి. ఇలా రెండుసార్లుగా చేయడం వల్ల జిగురు పోయి, బెండకాయలు చక్కగా క్రిస్పీగా వేగుతాయి.

బెండకాయలన్నీ వేయించిన తర్వాత, పాన్‌లో మిగిలిన నూనె సరిపోతుంది. ఇందులో ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. పోపు దినుసులు వేగిన తర్వాత, ఒక ఎండు మిరపకాయను తుంచి వేయాలి. తరువాత, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి,కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా వేయించాలి. తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కలపాలి.

ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత, పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచిన ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. వెల్లుల్లి వేపుడుకు మంచి వాసనను, రుచిని ఇస్తుంది. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు కారం, ముందుగా వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే బెండకాయ వేపుడు రెడీ.