
పెసర గారెలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి రెండు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా కొందరు పండుగల సమయంలో కూడా వీటిని తింటారు అలాంటి సాంప్రదాయ టిఫిన్. ఇవి బయటకు కరకరలాడుతూ, కానీ లోపల మెత్తగా ఉండే ఈ గారెలు సాయంత్రం స్నాక్‌గా కూడా తినొచ్చు. అంత బావుంటాయి

పెసర గారెలకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల పెసరపప్పు , ఒక చిన్న ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర , రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇలా చేస్తే గారెలు రుచికరంగా ఉంటాయి.

ముందుగా పెసలను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం గంటల పాటు వీటిని బాగా నానబెట్టాలి. అలాగే, నానిన పెసలను పూర్తిగా వంపి వాటిని మిక్సీలో వేసి నీరును కూడా వేసి కొంచం గట్టిగా రుబ్బుకోవాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.

పాన్ లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తరవాత చేతిని కొద్దిగా నూనె రాసుకుని ఆ పిండి ముద్దను తీసుకుని గారెల మాదిరి ఒత్తి రంధ్రం చేయాలి. ఈ వేడి నూనెలో వేసి ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే, వేడి వేడి పెసర గారెలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్ట్ వేరు

పిండిలో మరి నీళ్ళు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఇంకా ఒక కప్పు బియ్యం నానబెట్టి వాటిని పెసలతో కలిపి రుబ్బితే ఈ గారెలు మరింత రుచిగా ఉంటాయి. ఇంకా వీటిలో అల్లం, కరివేపాకు వేస్తే రుచి డబుల్ అవుతుంది. అలాగే, మీడియం మంటపై వేయిస్తే లోపల కూడా బాగా ఉడుకుతాయి.