Year Ender 2021: ప్రపంచ క్రికెట్‌లో మరుపురాని క్షణాలు.. వివాదాలే కాదు.. అరుదైన రికార్డులూ ఈ ఏడాది సొంతం..!

|

Dec 22, 2021 | 12:48 PM

Cricket Moments: గత 12 నెలల్లో క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ క్షణాలను ఓసారి గుర్తు చేసుకుందాం.

1 / 11
Year Ender 2021: మరో ఏడాది గడిచిపోయింది. 2022 మరికొద్ది రోజుల్లో రానుంది. అయితే పాత జ్ఞాపకాలను ఓ స్మరించుకుని, కొత్త ఏడాదిలోకి ఎంటర్ కావాల్సిన సమయం ఇది. గత 12 నెలల్లో క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ క్షణాలను ఓసారి గుర్తు చేసుకుందాం. గబ్బాలో భారత విజయం.. గబ్బాలో భారత టెస్ట్ విజయం మాత్రమే కాదు, క్రికెట్ చరిత్రలో బహుశా ఇది ఎంతో గొప్పది. ఈ ఏడాది జనవరి 7-జనవరి 19 వరకు  ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో భారత ప్లేయర్లు అద్భుతంగా ఆడి విజయం సాధించారు.  328 లక్ష్యాన్ని ఛేదించిన భారత ప్లేయర్లు గబ్బాలో విజయం సాధించి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నం.7 వాషింగ్టన్ సుందర్, ప్రస్తుత కాలంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరైన పాట్ కమ్మిన్స్‌ను సిక్సర్‌గా కొట్టడం, గబ్బా కోటను ఛేదించిన మొదటి జట్టుగా నిలిచింది.

2 / 11
న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ విజేత.. కైల్ జేమీసన్ విలియమ్సన్, రాస్ టేలర్, డెవాన్ కాన్వే, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ వంటి వారితో ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ ప్రదర్శనను ప్రదర్శించి డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటింది. ఎనిమిది వికెట్ల తేడాతో సులభంగా విజయం నమోదు చేయడంతోపాటు ట్రోఫీని అందుకుని రికార్డు నెలకొల్పింది.

3 / 11
హండ్రెడ్ చాలా ఆర్భాటంగా ప్రారంభమైంది. ఇక మహిళల పోటీలో భారతీయురాలు - జెమిమా రోడ్రిగ్స్ ఆధిపత్యం చెలాయించింది. ఆమె ఏడు ఇన్నింగ్స్‌లలో 249 పరుగులతో ప్రారంభ ఈవెంట్‌లో రెండవ అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచింది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రోడ్రిగ్స్ 43 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 92 పరుగులు చేసి సంచలనంగా మారింది.

4 / 11
అజాజ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్.. అజాజ్ పటేల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి అందిరి మనసులను గెలుచుకున్నాడు. ముంబైలో జన్మించిన న్యూజిలాండ్ ఎడమచేతి వాటం స్పిన్నర్.. ప్రపంచంలోని ఎలైట్ స్పిన్నర్లలో లెక్కించదగిన వ్యక్తిగా మారాడు. ప్రపంచంలోనే స్టార్ బౌలర్లుగా రాణించిన అశ్విన్‌, లియాన్‌లకు కూడా సాధ్యం కాని ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను అవలీలగా పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. నవంబర్‌లో జరిగిన ముంబై టెస్ట్‌లో భారత మొదటి ఇన్నింగ్స్‌లో, అజాజ్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత అలా చేసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.

5 / 11
ఆస్ట్రేలియన్ క్లైర్ పోలోసాక్ ప్రపంచ కప్‌లతో సహా అనేక అగ్రశ్రేణి మహిళల పోటీలలో అధికారికంగా పనిచేసింది. అయితే పురుషుల ప్రొఫెషనల్ క్రికెట్‌లో జరిగిన అనేక మ్యాచ్‌లలోనూ తన సత్తా చాటింది. ఈ ఏడాది జనవరిలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిడ్నీ టెస్టులో, పోలోసాక్ నాలుగో అంపైర్‌గా పని చేసి పురుషుల టెస్టులో పాల్గొన్న మొదటి మహిళా అంపైర్‌గా నిలిచారు.

6 / 11
టీ20 ప్రపంచకప్‌ అందుకున్న ఆస్ట్రేలియా.. ఆస్ట్రేలియా ప్రతి ప్రధాన వైట్-బాల్ ట్రోఫీని గెలుచుకున్న టీంగా మారింది. అయితే టీ20 ప్రపంచ కప్ టైటిల్ చాలా కాలం పాటు దక్కలేదు. యూఏఈలో జరిగిన 2021 టీ20 ప్రపంచ కప్‌లో, వారు ఫేవరెట్‌లలో మారి కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.

7 / 11
భారత ఓపెనర్ స్మృతి మంధాన రెండు మెరుపు సెంచరీలతో ప్రస్తుత యుగంలోని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా తన ఖ్యాతిని మెరుగుపరుచుకుంది. ఆమె తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 255 పరుగులతో భారతదేశపు టాప్ రన్-గెటర్‌గా ఈ సంవత్సరాన్ని ముగించింది. ఆపై మహిళల బిగ్ బాష్ లీగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి భారతీయురాలిగా మారింద. కేవలం 64 బంతుల్లో 114 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్ ఆడి ఆకట్టుకుంది. కరారాలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా పింక్-బాల్ టెస్ట్‌లో ఆమె స్ట్రోక్‌ఫుల్, సొగసైన చారిత్రాత్మక సెంచరీతో ఆకట్టుకుంది. మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 127 పరుగులతో రాణించింది. భారత మహిళల జట్టు మొట్టమొదటి డే-నైట్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో సూపర్ ఇన్నింగ్స‌తో ఆకట్టుకుంది.

8 / 11
2021 టెస్ట్ బ్యాటర్ జో రూట్‌కు ఈ ఏడాది చాలా అద్భుతంగా సాగింది. 14 టెస్టుల్లో 1630 పరుగులతో, రూట్ సుధీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1600 పరుగుల మార్క్‌ను అధిగమించిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మహ్మద్ యూసుఫ్(2006లో 1788 పరుగులు) పేరిట ఉంది. రూట్‌కి ఈ ఏడాది ఇంకా ఒక టెస్టు మిగిలి ఉంది. ప్రస్తుతం ఫామ్‌లో అతను దానిని కూడా అధిగమించే అవకాశం ఉంది.

9 / 11
కోహ్లీ వర్సెస్ బీసీసీఐ.. ప్రస్తుతం కోహ్లి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ఏడాదిలో భారతదేశానికి అనేక టెస్టు విజయాలకు నాయకత్వం వహించాడు. టీ20 ప్రపంచ కప్‌కు ముందు వైదొలగాలనే తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. అయితే పునరాలోచించమని బీసీసీఐ కోరినట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ఓ ప్రకటన చేశాడు. అయితే తాజాగా ఓ సమావేశంలో కోహ్లీ దానిని తిరస్కరించడంతో అసలు వివాదం మొదలైంది. 2023 ప్రపంచకప్‌లో జట్టుకు నాయకత్వం వహించాలనే కోరిక ఉన్నప్పటికీ, BCCI అతనిని ODI కెప్టెన్‌గా అనాలోచితంగా తొలగించడం కూడా పలు వివాదాలకు దారి తీసింది. వైట్‌బాల్ నాయకత్వ బాధ్యతలను రోహిత్ శర్మకు పూర్తిగా అప్పగించాలని పిలుపునిచ్చామని గంగూలీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

10 / 11
ఆస్ట్రేలియా మరో కుంభకోణంతో దద్దరిల్లింది. యాషెస్ 2021-22 ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు ఆస్ట్రేలియన్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ టెక్స్టింగ్ కుంభకోణంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. 2017లో జరిగిన సంఘటనలో పైన్ ఒక మహిళా సహోద్యోగికి అసభ్యకర సందేశాలు పంపినట్లు  ఆరోపణలు వచ్చాయి. దీంతో పైన్ తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. అలాగే తన కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.

11 / 11
టీ20ఐలో పాక్ ఆటగాళ్ల సత్తా.. 2021 ప్రారంభం కావడానికి ముందు, మొహమ్మద్ రిజ్వాన్ 26 మ్యాచ్‌లలో 313 పరుగులతో ఒక సాధారణ టీ20ఐ బ్యాటర్‌గా అత్యుత్తమంగా ఉన్నాడు. అతను 2021 ఫార్మాట్‌లో తన చివరి ఇన్నింగ్స్‌ను ఆడే సమయానికి, రిజ్వాన్ రికార్డును నెలకొల్పుతూ ఈ ఏడాదిని ముగించాడు. కేవలం 26 ఇన్నింగ్స్‌లలో, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ ఒక సెంచరీ, 12 అర్ధ సెంచరీలతో సహా 73.66 సగటుతో 1326 పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 10 అర్ధసెంచరీలు, 100-ప్లస్ ఫోర్లు కొట్టిన మొదటి టీ20ఐ బ్యాటర్, 1,000 పరుగుల మార్క్‌ను అధిగమించిన తొలి ప్లేయర్‌గా మరాడు.