
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్‌ను 3-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కుర్రాళ్లు కలిసికట్టుగా భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఈ సిరీస్‌లో బజ్‌బాల్‌ను ఓ ఆట ఆడేసుకున్నాడు టీమిండియా ఓపెనర్, యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్.

బ్యాటింగ్‌లో పరుగుల వరద పారిస్తూ.. అరుదైన రికార్డులను అన్నీ కూడా తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఘనత సాధించాడు జైస్వాల్. అయితే ఈ రికార్డు అటు సచిన్, ఇటు విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు. మరి అదేంటో చూసేద్దామా..

ఇప్పటిదాకా జైస్వాల్ ఆడింది 8 టెస్టులు. ఇక ఈ మ్యాచ్‌ల్లో అతడు ఏకంగా 971 పరుగులు చేశాడు. ఈ ఫీట్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు. ఈ రికార్డు సాధించి ఆల్‌టైం దిగ్గజ క్రికెటర్ అయిన డాన్ బ్రాడ్‌మాన్ సరసన నిలిచాడు.

యశస్వి కంటే ముందు బ్రాడ్‌మాన్ 8 మ్యాచ్‌ల్లో 1210 రన్స్ చేసి.. ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక జైస్వాల్(971) రెండో స్థానంలో ఉండగా.. సచిన్, కోహ్లీ ఆ తర్వాత వరుసలో ఉన్నారు. అటు ఇంగ్లాండ్‌పై ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన కోహ్లీ(655) సరసన చేరాడు జైస్వాల్.

ఇక చివరి టెస్టులో జైస్వాల్ ఈ రికార్డు బద్దలుకొట్టి.. 700కిపైగా స్కోర్ సాధించిన గవాస్కర్ సరసన చేరే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ కుదిరితే.. గవాస్కర్ రికార్డును సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది జైస్వాల్. ఈ రన్ మిషన్.. టీమిండియాకు మరో గంగూలీ రూపంలో దొరికేశాడు.