WTC 2023 Final: లెజెండరీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన జడ్డూ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన నం1 ఆల్ రౌండర్..

|

Jun 10, 2023 | 5:28 PM

Ravindra Jadeja: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత నంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 2 వికెట్లు పడగొట్టాడు.

1 / 5
Ravindra Jadeja: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత నంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత దిగ్గజ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ రికార్డును బద్దలు కొట్టాడు.

2 / 5
బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ జడేజా ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 48 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.అంతకుముందు బౌలింగ్ లోనూ కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మూడో రోజు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లాంటి ప్రమాదకరమైన బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించాడు.

3 / 5
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా రెండు వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఏకైక ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ బిషన్ సింగ్ బేడీ పేరు మీద ఉంది. ప్రస్తుతం జడేజా 65 టెస్టుల్లో 267 వికెట్లు తీసి ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

4 / 5
జడేజా ఓవరాల్‌గా 4వ స్థానంలో నిలిచాడు. రంగనా హెరాత్ (433 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెటోరి (362) రెండు, ఇంగ్లండ్‌కు చెందిన డెరెక్ అండర్‌వుడ్ (297) మూడో స్థానంలో ఉన్నారు.

5 / 5
అంతేకాకుండా ఆస్ట్రేలియా డేంజరస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను జడ్డూ 8 సార్లు అవుట్ చేసి రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు.