ICC 2023 ODI World Cup, Rishabh Pant: న్యూ ఇయర్ కోసం ఢిల్లీ నుంచి రూర్కీలోని తన ఇంటికి వెళ్తున్న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు గాయం నుంచి కోలుకోలేదు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడగలడా లేదా అని తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇంతలో అతను తిరిగి రావడం గురించి కీలక అప్‌డేట్ వచ్చింది.
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ రిషబ్ పంత్ ఆరోగ్యంపై పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిషబ్ పంత్ తన గాయం నుంచి కోలుకోవడంపై పూర్తిగా దృష్టి పెట్టాడని అతను చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌నకు ముందు పంత్ పూర్తిగా ఫిట్‌గా ఉండటం కష్టమని శ్యామ్ శర్మ తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్‌లో పంత్ పాల్గొనలేడని భావిస్తున్నారు.
"రిషబ్ పంత్ మంచి పురోగతి సాధిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్ (అక్టోబర్-నవంబర్‌లో) తర్వాత అతను కోలుకోవచ్చు. ఎన్‌సీఏ నుంచి బయటకు వస్తాడు." అని DDCA డైరెక్టరేట్ బెంగళూరులో రిషబ్ పంత్‌ను కలిసిన తర్వాత వార్తా సంస్థ IANS కి తెలిపాడు.
ఆయన మాట్లాడుతూ, "రిషబ్ పంత్ బాగా వ్యాయామం చేస్తున్నాడు. నేను అతనితో అరగంట పాటు ఉన్నాను. అతను వేగంగా కోలుకుంటున్నాడు. అతనికి అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నాడు. అతనికి నడక, మెట్లు ఎక్కడానికి సంబంధించిన అన్ని వ్యాయామాలు నిర్వహిస్తున్నారు. మట్టి లేదా గడ్డి మీద కూడా నడుస్తున్నాడు.
క్రికెట్‌లో అతిపెద్ద మహాకుంభ్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది భారతదేశంలోని 10 వేర్వేరు నగరాల్లోని స్టేడియంలలో నిర్వహించనున్నారు. అదే సమయంలో భారత జట్టు ప్రపంచకప్‌లో తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది.