WPL Auction: డబ్ల్యూపీఎల్ తొలి వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. టాప్ 5 ప్లేయర్స్ వీరే!

|

Feb 14, 2023 | 9:55 AM

ముంబై వేదికగా జరిగిన తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలం బంపర్ హిట్ కొట్టింది. మొత్తం 87 ఆటగాళ్లు ఈ ఆక్షన్‌లో అమ్ముడుపోగా.. ఇందులో 47 మంది భారత మహిళా క్రికెటర్లు ఉన్నారు.

1 / 7
WPL Auction: డబ్ల్యూపీఎల్ తొలి వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. టాప్ 5 ప్లేయర్స్ వీరే!

2 / 7
స్మృతి మందాన:   ఈ వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.

3 / 7
దీప్తి శర్మ:    ఈ టీమ్ ఇండియా ఆల్ రౌండర్‌ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరికి యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లకు దీప్తి శర్మను సొంతం చేసుకుంది.

4 / 7
జెమీమా రోడ్రిగ్జ్:   టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్జ్‌ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

5 / 7
షెఫాలీ వర్మ:   తుఫాన్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా నిలిచే ఈ లేడీ సెహ్వాగ్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

6 / 7
పూజా వస్త్రాకర్:   ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ను వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.

7 / 7
అలాగే రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లకు(ఆర్‌సీబీ), హార్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లకు(ముంబై), రేణుక సింగ్ - రూ. 1.5 కోట్లకు(ఆర్‌సీబీ), యస్టిక భాటియా - రూ. 1.5 కోట్లకు(ముంబై), దేవిక వైద్య - రూ. 1.4 కోట్లకు( యూపీ వారియర్స్) దక్కించుకున్నాయి.