Team India: విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలు ఇకపై టీ20 క్రికెట్ ఆడలేరా.. అసలు కారణం ఏంటి? హిట్‌మ్యాన్ ఏమన్నాడంటే..

|

Aug 11, 2023 | 7:39 PM

Rohit Sharma-Virat Kohli T20I Cricket: రోహిత్, కోహ్లిలు ఇకపై టీ20లో భారత్ తరపన ఆడరంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. యువ ఆటగాళ్లను తయారుచేసే క్రమంలో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడం లేదని వార్తలు వినిపించాయి. కానీ వాస్తవం వేరు. ఇలాంటి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 8
గత ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి భారత క్రికెట్ జట్టు నిష్క్రమించినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఏ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఆడలేదు. నవంబర్ 10, 2022న, రెండో సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన తర్వాత వీరిద్దరూ T20Iలలో ఆడలేదు.

2 / 8
ఇక రోహిత్‌, కోహ్లిలు భారత్‌ తరపున టీ20ఐలో ఆడరని కూడా వార్తలు వచ్చాయి. యువ ఆటగాళ్లను తయారుచేసే క్రమంలో ఈ దిగ్గజాలను జట్టులోకి తీసుకోవడం లేదన్నారు. కానీ వాస్తవం వేరు. గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

3 / 8
మేం కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం. గతేడాది కూడా అదే పని చేశాం. 2022లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. కాబట్టి మేం వన్డే క్రికెట్ ఆడలేదు. ఈసారి వన్డే ప్రపంచకప్‌ ఉంది. వన్డే క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నందున టీ20లు ఆడడం లేదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

4 / 8
మీరు అన్ని రకాల క్రికెట్‌లు ఆడటం ద్వారా ప్రపంచకప్‌నకు సిద్ధం కాలేరు. రెండేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాం. రవీంద్ర జడేజా కూడా ఆగస్టు 2022 నుంచి టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. హిట్ మ్యాన్ కూడా మా ప్లాన్‌లో ఉన్నాడని తెలిపాడు.

5 / 8
ఇది ప్రపంచకప్ సంవత్సరం. ఆటగాళ్లందరూ ఫ్రెష్‌గా ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇప్పటికే జట్టులో చాలా మంది గాయాలను చూశాం. నేను కూడా ఇప్పుడు గాయం గురించి భయపడుతున్నాను. ఆటగాళ్లను బాగా చూసుకోవాలని బీసీసీఐతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

6 / 8
ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశం దొరికినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటాం. ముఖ్యమైన టోర్నీలను ఎవరూ కోల్పోకూడదు. ఇప్పటికే మన కీలక ఆటగాళ్లు గత రెండేళ్లలో కొన్ని పెద్ద టోర్నీలకు దూరమయ్యారు. దానిని కొనసాగించకూడదని రోహిత్ తెలిపాడు.

7 / 8
గత కొంత కాలంగా మా నాలుగో నంబర్ మాకు తలనొప్పిగా మారింది. యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థానాన్ని ఏ బ్యాట్స్‌మెన్ కూడా భర్తీ చేయలేకపోయాడు. కానీ, శ్రేయాస్ అయ్యర్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ద్వారా విశేషమైన ప్రదర్శన ఇచ్చాడు. అతని గణాంకాలు బాగున్నాయి - రోహిత్ శర్మ.

8 / 8
అయితే వెన్ను గాయం కారణంగా గత కొన్ని నెలలుగా శ్రేయాస్ జట్టుకు దూరం కావడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అందువల్ల ముఖ్యమైన టోర్నీ ప్రారంభానికి ముందే ఈ లోపాన్ని టీమిండియా సరిదిద్దుకోవాలని రోహిత్ శర్మ తెలిపాడు.