
కోహ్లి కంటే ముందు సచిన్(577 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్(588 ఇన్నింగ్స్), జాక్వెస్ కలిస్(594 ఇన్నింగ్స్), కుమార సంగక్కర(608 ఇన్నింగ్స్),మహేల జయవర్ధనే(701 ఇన్నింగ్స్) కూడా ఈ ఘనత సాధించారు.

ఇప్పటికే 74వ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇంకా 27 సెంచరీలు కావాలి. అయితే 34 ఏళ్ల కోహ్లీ మరికొన్నాళ్లు క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిపించడం అయితే ఖాయం. తద్వారా సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడని సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు.

1. రికీ పాంటింగ్: జట్టు విజయం సాధించిన మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్ 3 బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రికీ పాంటింగ్ 71 సెంచరీలు చేయగా, వాటిలోని 55 సెంచరీలు ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించడం విశేషం.

ఇక భారత్ తరఫున కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను సాధించాడు. అయితే సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 25000 చేయడానికి 577 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కింగ్ కోహ్లీ 107 టీ20 ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 4008 పరుగులు చేశాడు. ఇక ఇందులో 37 అర్ధసెంచరీలు, 1 సెంచరీ కూడా ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ తప్ప మరే బ్యాట్స్‌మెన్ 4000 పరుగులు చేయకపోవడం విశేషం.