Virat Kohli: బంగ్లాపై చేసిన సెంచరీతో కొహ్లీ ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాడో తెలుసా..? వివరాలు ఇదిగో..

|

Dec 10, 2022 | 7:27 PM

ఛటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 3వ వన్డేలో యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. అయితే భారత మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. దీంతో కింగ్ కోహ్లీ కూడా.. పలు రికార్డులను..

1 / 6
ఛటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 3వ వన్డేలో యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ఆ ఫీట్ సాధించిన ఏడో అంతర్జాతీయ ఆటగాడిగా, నాలుగో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అయితే భారత మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. దీంతో కింగ్ కోహ్లీ కూడా పలు రికార్డులను తిరగరాశాడు.

2 / 6
ఈ మ్యాచ్‌లో 91 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ 2  భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. అయితే ఈ సెంచరీతో విరాట్ కోహ్లి ఎన్నో రికార్డులను బద్దలుకోట్టడం విశేషం. అవేమిటంటే..

3 / 6
అత్యధిక సెంచరీలు: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్ కోహ్లీ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకున్నాడు. అంతకు ముందు 71 సెంచరీలతో ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు 72 సెంచరీలతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలోకి చేరి పాంటింగ్‌ను అధిగమించాడు.

4 / 6
బంగ్లాదేశ్‌పై అత్యధిక పరుగులు: బంగ్లాదేశ్ జట్టుపై వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ కూడా కింగ్ కోహ్లీయే. బంగ్లాదేశ్‌పై 1000 పరుగులు పూర్తి చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

5 / 6
అత్యధిక ఫోర్లు: వన్డే క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1,162)ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. అలాగే 1,172 ఫోర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

6 / 6
అత్యల్ప ఇన్నింగ్స్ రికార్డు: బంగ్లాదేశ్‌పై సాధించిన ఈ  సెంచరీతో విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 44వ సెంచరీని పూర్తి చేశాడు. విశేషమేమిటంటే.. సచిన్ టెండూల్కర్ కంటే కోహ్లి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ తన 418వ ఇన్నింగ్స్‌లో 44వ వన్డే సెంచరీని నమోదు చేయగా, విరాట్ కోహ్లీ తన 256వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.