Virat Kohli Birthday: క్రికెట్ ప్రపంచంలో రారాజు.. 36వ ఏట అడుగుపెట్టనున్న రన్ మెషీన్.. రికార్డులు ఇవే..

|

Nov 05, 2023 | 9:31 AM

Happy Birthday Virat Kohli: కఠోర శ్రమ, ధైర్యం కోహ్లీని ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిపాయి. ప్రపంచకప్‌లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా విరాట్ కోహ్లీ పుట్టినరోజు నాడు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లి పుట్టినరోజు వేడుకలు జోరుగా సాగనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌లో సచిన్ రికార్డులపై కోహ్లీ కన్నేశాడు.

1 / 7
Virat Kohli Birthday: సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు 35వ ఏట అడుగుపెట్టాడు. జీవితంలో తొలిదశలో ఎన్నో అపజయాలు చవిచూసి నేడు ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

2 / 7
ప్రపంచకప్‌లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా నేడు జరగనుండగా, ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లి పుట్టినరోజు వేడుకలు జోరుగా సాగనున్నాయి. కఠోర శ్రమ, ధైర్యసాహసాలు కోహ్లీని ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా మార్చాయి. ఈరోజు విరాట్ బ్యాట్‌తో సెంచరీ సాధిస్తే సచిన్ సెంచరీల రికార్డును సమం చేస్తాడు.

3 / 7
విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న న్యూ ఢిల్లీలో తండ్రి ప్రేమ్ కోహ్లీ, తల్లి సరోజ్ కోహ్లీ దంపతులకు జన్మించాడు. కోహ్లి తన తొలి రోజుల్లో కోచ్ రాజ్‌కుమార్ శర్మ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందాడు. 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో తన సారథ్యంలో భారత్‌ను ప్రపంచకప్‌లో చేర్చిన కోహ్లి వెంటనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

4 / 7
కవర్ డ్రైవ్‌లు, క్లాసిక్ షాట్‌లకు పేరుగాంచిన విరాట్, పరుగులు సాధించడానికి సిక్సర్ల కంటే ఫోర్లపైనే ఎక్కువగా ఆధారపడే బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. ప్రధానంగా అతని కవర్ డ్రైవ్ లు, ఫ్లిక్ షాట్‌లు చూడటం క్రికెట్ ప్రేమికులకు కన్నుల పండువగా ఉంటుంది.

5 / 7
అతనికి 2013లో అర్జున అవార్డు, 2017లో దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ, 2018లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. ఇది కాకుండా, అతను ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

6 / 7
2008లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన విరాట్ ఇప్పటికే 111 మ్యాచ్‌ల్లో 49.3 బ్యాటింగ్ సగటుతో 8,676 పరుగులు చేశాడు. 13,525 పరుగులతో వన్డే క్రికెట్‌లో ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 4008 పరుగులు చేసిన ఘనత కూడా కింగ్ కోహ్లీకే దక్కింది.

7 / 7
ఐపీఎల్‌లోనూ మెరిసిన కోహ్లీ 2016 సీజన్‌లో 973 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం.