Vaibhav Suryavanshi: బుడ్డోడా మజాకానా.! 32 బంతుల్లోనే ముచ్చెమటలు.. కోహ్లీ ఫ్రెండ్‌కే దడ పుట్టించాడుగా

Updated on: Nov 15, 2025 | 11:36 AM

బుడ్డోడు.. బుడ్డోడు అంటే.. గుడ్డలు ఊడదీసి కొడతా.. ఈ ఎన్టీఆర్ డైలాగ్ మీరు వినే ఉంటారు. సరిగ్గా దీనికి తగ్గట్టుగా నిన్న దోహాలో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ ఇన్నింగ్స్ పై ఓ లుక్కేయండి మరి.

1 / 5
దోహాలో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌ జరుగుతోంది. నిన్న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ మరోసారి రెచ్చిపోయాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసి.. భారత క్రికెట్‌లో తన పేరిట మరో రికార్డు నెలకొల్పాడు.

2 / 5
శనివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఈ లిస్టులో ఇప్పటికే 28 బంతుల్లో సెంచరీ చేసి.. ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచారు.

3 / 5
ఇక బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ గురించి చూస్తే.. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. 10 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నాడు. అలాగే కేవలం 17 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సైతం పూర్తీ చేశాడు. ఆ తర్వాత మరో 15 బంతుల్లోనే తన సెంచరీ సాధించాడు.

4 / 5
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి అవుట్ అయ్యాడు వైభవ్. ఇందులో 11 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టాడు. ఒకానొక సమయంలో 200 పరుగులు వైభవ్‌కు సాధ్యం అని అందరూ భావించగా.. చివరికి పెవిలియన్ చేరాడు.

5 / 5
ఇక వైభవ్ ఈ ఇన్నింగ్స్‌తో ఏకంగా కోహ్లి ఫ్రెండ్‌కే దడ పుట్టించేలా చేశాడు. అతడు మరెవరో కాదు.. క్రిస్ గేల్.! టీ20ల్లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 175 పరుగులు చేశాడు. కొంచెం ఉంటే ఈ రికార్డు వైభవ్ పేరిట నమోదయ్యేది.