India Vs Australia: ఆసియా కప్ 2023 ను కైవసం చేసుకున్న టీమిండియా సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ 2023 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఇరు జట్లకు తుది సన్నాహాలు చేయడానికి ఒక అవకాశంగా నిలిచింది. సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రపంచ కప్‌లోకి నూతనోత్సాహంతో అడుగుపెట్టనున్నాయి.
ఇప్పటికే భారత్ ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు జట్టును ప్రకటించలేదు. అయితే ప్రపంచకప్‌లో పోటీపడే జట్టు ఆసీస్‌తో తలపడటం ఖాయం.
గాయం కారణంగా అక్షర్ పటేల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైనట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే తెలిపాడు. అంటే అక్షర్‌కు బదులు జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరగా మారింది. ఆసీస్‌తో జరిగే సిరీస్‌లో భారత జట్టులో ఎవరు ఉంటారు అనేదానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపెనర్లు: ప్రపంచకప్‌కు ముందు జరిగే ముఖ్యమైన సిరీస్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ, కిషన్ ఆస్ట్రేలియాపై లేదా ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా వచ్చే అవకాశం లేదు.
మిడిల్ ఆర్డర్: వెన్ను సమస్యతో ఆసియా కప్‌నకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వస్తాడని భావిస్తున్నారు. అలాగే అయ్యర్ వన్డే జట్టులో కీలక సభ్యుడు కావడంతో అతనికి జట్టులో స్థానం కల్పించడం ఖాయం. విరాట్ కోహ్లీ 3వ నంబర్‌లో బ్యాటింగ్‌ను కొనసాగించనున్నాడు.
మిడిలార్డర్‌లో వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇక్కడ రాహుల్ వికెట్ కీపర్‌గా కూడా కనిపించాడు. అంటే, అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే కిషన్ బెంచ్‌పై వేచి ఉండాల్సి రావచ్చు.
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ నలుగురు ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే అక్షర్ గాయపడటంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడడం లేదు. తద్వారా వాషింగ్టన్ సుందర్ జట్టులో చోటు దక్కించుకోవచ్చు.
బౌలర్లు: ఎప్పటిలాగే జస్ప్రీత్ బుమ్రా పేస్ అటాక్‌కు నాయకత్వం వహించనున్నాడు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీకి జట్టులో చోటు దక్కడం ఖాయం. కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ప్రసీద్ధ్ కృష్ణకు చోటు దక్కకపోవడం ఖాయమని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు భారత సంభావ్య జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.