Virat Kohli Records: ఛేజింగ్ మాస్టర్‌గా విరాట్ కోహ్లీ.. సచిన్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన రన్ మెషీన్..

|

Oct 12, 2023 | 8:38 PM

Virat Kohli Records: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. ఆసియాకప్ నుంచి దూకుడు పెంచాడు. ఇదే క్రమంలో వన్డే ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా మరో అర్ధ సెంచరీతో వన్డే క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక 50+ స్కోరు చేసిన ప్రపంచ రికార్డ్ హోల్డర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.

1 / 5
Virat Kohli Records: ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన కింగ్ కోహ్లీ 56 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతో అజేయంగా 55 పరుగులు చేశాడు.

2 / 5
ఈ అర్ధ సెంచరీతో, వన్డే క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 50+ స్కోర్లు సాధించి ప్రపంచ రికార్డ్ హోల్డర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.

3 / 5
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లలో 45 సార్లు 50+ స్కోర్‌లు నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

4 / 5
ఇప్పుడు విజయవంతమైన ఛేజింగ్‌లో 46వ సారి 50+ పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.

5 / 5
ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టాలంటే విరాట్ కోహ్లీకి 3 సెంచరీలు కావాలి. మరి ఇప్పుడు ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్న కింగ్ కోహ్లీ రానున్న మ్యాచ్‌లలోనైనా ఈ రికార్డును బద్దలు కొడతాడో లేదో వేచి చూడాలి.