భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌పై తన ఏడవ సెంచరీతో ఐసీసీ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
రోహిత్ కేవలం 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో ఈ మార్కును చేరుకున్నాడు. 36 ఏళ్ల హిట్‌మ్యాన్ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డును సమం చేశాడు.
ప్రపంచ కప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లలో రోహిత్ (7) అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సచిన్ (6), రికీ పాంటింగ్ (5), కుమార సంగక్కర (5) నిలిచారు.
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి తర్వాత 1000 పరుగుల మార్క్‌ను దాటిన నాలుగో భారతీయుడిగా రోహిత్ నిలిచాడు.
రోహిత్ తన ప్రపంచ కప్ ప్రయాణాన్ని 2015 ఎడిషన్‌లో ప్రారంభించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సెంచరీతో 330 పరుగులు చేశాడు. ఈ ముంబై ప్లేయర్ 2019 ఎడిషన్‌లో 5 సెంచరీలతో, ఒకే ఎడిషన్‌లో అత్యధిక సెంచరీల రికార్డులను బద్దలు కొట్టాడు. రోహిత్ 648 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.