IND vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక వికెట్ల వీరులు వీరే.. లిస్టులో బూం బూం బుమ్రా.. ఎన్నంటే?
బుమ్రాతోపాటు కుల్దీప్ యాదవ్, సిరాజ్, పాండ్యా, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టి పాక్ బలమైన ఆరంభాన్ని చెడగొట్టడంతోపాటు కేవలం 42.5 ఓవర్లో ఆలౌట్ చేశారు. దీంతో పాకిస్తాన్ తన ఇన్నింగ్స్ చివరి 13 ఓవర్లలో కేవలం 36 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో 191 పరుగులకు ఆలౌట్ అయింది. 1999 తర్వాత 50 ఓవర్ల ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోరుగా నిలిచింది.